Pooja Hegde : హీరోయిన్ కాకపోతే, పూజా హెగ్దే ఏమయ్యి వుండేదో తెలుసా.?

Pooja Hegde :  చాలా మంది సెలబ్రిటీలు సింపుల్‌గా చెప్పే మాట.. ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను..’ అని. అయితే, బుట్టబొమ్మ పూజా హెగ్దే మాత్రం యాక్టర్ అయ్యింది. కానీ, డాక్టర్ మాత్రం కావాలనుకోలేదట. మరి పూజా హెగ్దే ఏమవ్వాలనుకుందో తెలుసా.?
బుట్టబొమ్మగా ఇటు టాలీవుడ్‌నీ, అటు బాలీవుడ్‌నీ ఉర్రూతలూగిస్తున్న పూజా హెగ్దే, ‘బీస్ట్’‌తో తమిళ తంబీల్ని కూడా ఇంప్రెస్ చేసేసింది. అయితే, పూజా హెగ్దేకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. ఒకవేళ హీరోయిన్ కాకుంటే, బెస్ట్ ట్రావెలర్‌గా సెటిలైపోయేదాన్నిఅని క్యూట్ క్యూట్‌గా చెప్పేస్తోంది.
అలాగే స్టైలింగ్ అంటే కూడా చాలా ఇష్టమంటోంది పూజా హెగ్దే. ఒకవేళ హీరోయిన్ కాకపోతే, సినీ రంగంలో  స్టైలిష్ట్గ్‌ అవ్వాలని కూడా అనుకుందట.  కానీ, కథ  అడ్డం తిరిగింది. రంగుల ప్రపంచానికి అందమైన బటర్ ఫైలా పరిచయమైంది. స్టైలిష్ట్‌గా తెర వెనుకే వుండిపోవడం కాదు, వెండితెరపై సూపర్ స్టైలిష్ హీరోయిన్‌గా పాపులర్ అయిపోయింది.
హీరోయిన్‌గా తిరుగులేని స్టార్‌డమ్ దక్కించుకుంది పూజా హెగ్దే. బుట్టబొమ్మగా సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్‌ సినిమాలతో దుమ్ము దులిపిన పూజా హెగ్దే త్వరలో ‘ఆచార్య’ సినిమాతో రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సరసన ‘ఆచార్య’లో పూజా హెగ్దే నటిస్తోన్న సంగతి తెలిసిందే.
సరే, ట్రావెలింగ్ అంటే ఇష్టం కదా.. మరి పూజా హెగ్దే ఫేవరేట్ హాలీడే స్పాట్ ఏంటో తెలుసా.? న్యూయార్క్ మరియు లండన్ అట. షూటింగ్స్ నుంచి కొంత టైమ్ దొరికితే చాలు, తన ఫేవరేట్ హాలీడే స్పాట్స్‌లో వాలిపోతుందట పూజాహెగ్దే. అన్నట్లు ఈ రెండు ప్రదేశాలూ ఎందుకంత ఇష్టం పూజా హెగ్దేకి అంటే, అందుకూ ఓ అందమైన రీజన్ చెప్పింది బుట్టబొమ్మ.
న్యూయార్క్‌లో షాపింగ్ చేయడమంటే పూజా హెగ్దేకి చాలా చాలా ఇష్టమట. అలాగే, బెస్ట్ ఫుడీ అయిన పూజా హెగ్దే,  లండన్‌లో ఫుడ్ చాలా బావుంటుందని చెబుతోంది.  అదీ సంగతి.