Lakshmi Sowjanya: ఆ రోజు సుమ లేకపోతే ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదేమో…. లక్ష్మీ సౌజన్య షాకింగ్ కామెంట్స్!

Lakshmi Sowjanya: సినీ ఇండస్ట్రీ అంటేనే మామూలుగానే చాలా మంది ఇల్లు అద్దెకు ఇవ్వడానికి సందేహిస్తుంటారని, అదీ అమ్మాయిలకు అంటే అస్సలు ఇవ్వరని సినీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య అన్నారు. ఒక వేళ ఇచ్చినా కూడా ఓనర్స్‌కి ఎప్పుడూ వీళ్లు టైంకి ఇస్తారా, లేదా అన్న భయం ఉంటుందని ఆమె చెప్పారు. తాను అలాంటి సంఘటనలు చాలా ఫేజ్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

తాను అద్దె కోసమని వెళ్లినపుడు, తనకు ఇంతకుముందు ఆర్గానిక్ బిజినెస్ ఉండేదని, ఆ షాప్ అడ్రస్ ఇచ్చేదాన్ని అని ఆమె అన్నారు. తాను అక్కడ వర్క్ చేస్తానని చెప్పేదాన్నని, లేదంటే రెంట్‌కి దొరకడం కష్టమయ్యేదని ఆమె చెప్పారు. అందరూ అలా ఉంటారా అంటే అదేం కాదని, కొంత మంది మాత్రమే ఇండస్ట్రీ వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి సందేహిస్తుంటారని ఆమె తెలిపారు. నిజం చెప్పాలంటే వాళ్ల తప్పేం అందులో లేదని, ఎందుకంటే అంతకుముందున్న వాళ్లు అలా చేశారేమో, కాబట్టి మనం కూడా అలానే అనుకుంటారని లక్ష్మీ చెప్పారు.

సినిమా వాళ్లు అంటే ఒక సినిమా అయిపోగానే మరో సినిమా వెతుక్కోవాల్సి ఉంటుందని, దాని వల్ల కొన్నిసార్లు రెంట్ కొంచెం లేట్ అయ్యే అవకాశాలుంటాయని ఆమె అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఇంటి యజమానులు వీళ్లయితే సరిగా ఇవ్వరు… సాఫ్ట్‌వేర్ వాళ్లయితే కరెక్టుగా ఇస్తారన్న భావనలో ఉంటారని ఆమె తెలిపారు. ఇంకో విషయమేమిటంటే వీళ్లకు టైమింగ్ ఉండదు. రాత్రి ఎప్పుడో వస్తారని, ఇలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్లు నో చెప్తారని ఆమె అన్నారు.

ఇకపోతే యాంకర్ సుమ వాళ్లింట్లో తాను దాదాపు ఏడాదిపాటు ఉన్నానని, తనను ఆమె బాగా చూసుకునేదని ఆమె చెప్పారు. తాను చదువుకునేటపుడు సుమ వాళ్లింటి పక్కన హాస్టల్‌లో ఉండేదాన్నని, నిజంగా ఆ రోజు సుమ తనకు హెల్ప్ చేసి ఉండకపోయి ఉంటే తాను ఇంటికి వెళ్లిపోయేదాన్నేమోనని, ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదని ఆమె వివరించారు.