Aamani: ఆయన అవకాశం ఇస్తే చిన్న పాత్రలో అయినా నటిస్తా… నటి ఆమని కామెంట్స్!

Aamani: ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి ఆమనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం పెళ్లి పుస్తకం శుభలగ్నం మావిచిగురు వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.ఇలా తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన ఆమని వివాహం అనంతరం కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమనీ వరుస సినిమాలు, బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఆమని కేవలం వెండితెర ప్రేక్షకులను మాత్రమే కాకుండా సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమనీ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తనకు ఒక కల ఉందని ఆ కల చచ్చేలోగా నెరవేర్చుకుంటానని తెలిపారు.

సాధారణంగా స్టార్ డైరెక్టర్ సినిమాలలో నటించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే అలాంటి దర్శకుల సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తారు. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమనికు కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని అది చిన్న పాత్ర అయిన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చచ్చేలోగా తప్పకుండా తన సినిమాలో చేస్తానని తెలిపారు. మరి రాజమౌళి ఈ నటికి అవకాశం ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.