ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీ తరుపున నిలబెట్టిన అభ్యర్ధి వర్ల రామయ్య గెలవరని తెలిసినా పోటీ బరిలో దించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అంతా అనుకున్నట్లే జరిగింది. వర్ల రామయ్యకు 17 ఓట్లే దక్కాయి. దీంతో యాధావిధిగా ఓటమి తప్పలేదు. అయితే రామయ్యను రంగంలోకి దించడం వెనుక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ బయట పడిందని వైకాపా నేతలు ఆరోపించారు. బీసీల సానుభూతి కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నం అని ఎద్దేవా చేసారు. వర్ల రామయ్య గెలవరని తెలిసినా? ఆయన్ని ఎందుకు నిలబెట్టినట్లో చంద్రబాబు కే తెలియాలన్నారు. గెలవరని తెలిసినా వర్ల రామయ్య ఎందుకు పోటీ చేసారా ఆయనకే తెలియాలన్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య ఆ వర్గంపై కపట చూపించడం కోసమే ఇలా చేసాడని…బీసీల పరువు తీయడం కోసం ఇలా చేసారని అధికార పక్షం బీసీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబుకు దళితల పట్ల నిజమైన ప్రేమ ఉంటే వర్ల రామయ్యని తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షుడిగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. రాజ్యసభ ఎన్నికల్లో బలం ఉన్నప్పుడు వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్ చంద్రబాబుకు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవం నిలబెట్టాలంటే టీడీపీలో రామయ్య లోకేష్ పదవిలో ఉండాలన్నారు. టీడీపీలో జాతీయ కార్యదర్శి పదవి నుంచి లోకేష్ ని తప్పించి ఆబాధ్యతల్ని వర్ల రామయ్యకి అప్పజెప్పాలన్నారు.
బలం ఉంటే బాబు మనుషలకి, ఓడిపోయే పరిస్థితి ఉంటే దళితులకు అవకాశం ఇస్తారా? అని నిలదీసారు. ఇలాంటి నీచ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి 40 ఏళ్ల ఇండస్ర్టీ తోక ముడిచిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చేసరికి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ ఖజానా చక్కదిద్దుకుంటూనే సంక్షేమ పథకాల్ని సీఎం అమలు చేస్తున్నారన్నారు. జగన్ కి-చంద్రబాబుకు మధ్య పోలిక చూస్తే నక్కకి..నాగ లోగానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేసారు.