బిగ్ బాస్ ఓటీటీ అవకాశం వచ్చినా వదులుకున్నా… కారణం అదే?

యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అటువంటి వారిలో అతి తక్కువ మంది గుర్తింపు పొంది సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యి మంచి గుర్తింపు పొందిన వారిలో సిరి హనుమంత్ కూడా ఒకరు. చదువు మధ్యలో ఆపేసి వచ్చిన మొదట సీరియల్ లో నటించింది. తర్వాత కొన్ని సినిమాలలో కూడా నటించి ఇటు బుల్లితెర మీద వెండితెర మీద మంచి గుర్తింపు. షార్ట్ ఫిలిమ్స, వెబ్ సిరీస్ ద్వారా సిరి మరింత పాపులర్ అయ్యింది.

ఈ క్రమంలోనే సిరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పార్టిసిపచేసే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి మితిమీరిన ప్రవర్తన కారణంగా సిరి నెగిటివిటీ మూటగట్టుకొని ఆ విధంగా కూడా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సిరి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సందడి చేయనుంది. హిందీ వెబ్ సిరీస్ ‘అడల్టింగ్‌’ ని తెలుగులో ‘బీఎఫ్‌ఎఫ్‌’ గా రీమేక్ చేసి ఆహాలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే సిరి మాట్లాడుతూ అడల్టింగ్‌ అని పేరు ఉండటంతో ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదని తెలిపారు. తనకు బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని, తాను ఊహించని స్థాయిలో ప్రేక్షకులు ఆదరించారని వారి ఆదరాభిమానాలు వల్లే తాను ఫైనల్ వరకు వెళ్లానని సిరి తెలిపారు. కాకపోతే తనకు బిగ్ బాస్ ఓటీటీ అవకాశం కూడా వచ్చిందని, ఈ ప్రాజెక్టు కారణంగా ఆ అవకాశాన్ని వదులుకున్నానని ఈమె తెలిపారు.