తేజస్విని సమర్పణలో జె.వి.యమ్ పతాకంపై అమరేష్ రాజు, ఖుషి ఆనంద్, భాగ్య లక్ష్మి, రాజేష్ నటీ నటులుగా సునీల్ పొన్నం దర్శకత్వంలో జె. మహాలక్ష్మి, జె. సరిత లు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన చిత్రం “ఐడెంటిటీ”అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..
కథ:
రిషి దేవ్ (అమరేష్ రాజు ) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB ) లో ఏసీపీ గా పనిచేస్తూ క్రిమినల్స్, డ్రగ్స్ కేసులే లోకంగా బ్రతుకుతూ తన టీంతో ఎన్నో డ్రగ్స్ కేసులను చేదిస్తూ డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ వారిని యముడిలా తరుముతుంటాడు.. అయితే ఒక డ్రగ్స్ కేస్ రైడింగ్ చేస్తున్న టైంలో న్యూస్ రిపోర్టర్ ప్రీతి (ఖుషి ఆనంద్ )తో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న టైమ్ లో రిషి దేవ్ కి యాక్సిడెంట్ అయ్యి ఆమ్నేసియా అనే డిసీజ్ ద్వారా తన గతాన్ని కోల్పోతాడు. కొంతకాలానికి గతాన్ని కోల్పోయిన రిషి మళ్ళీ ఆఫీస్ కు వెళతాడు.
దాంతో వాళ్ళ కమిషనర్ భరణి రిషి తో నీకు గతం గుర్తుకు రాకపోతే క్రిమినల్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు.కాబట్టి నువ్వు గతాన్ని గుర్తుకు వచ్చేలా ప్రయత్నించు లేకపోతే నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి అని చెప్తూ పెద్ద కేసులు కాకుండా చిన్న కేసులను ఇన్వెస్టిగేషన్ చేయమంటాడు.. తన గతాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో ఒక కేస్ ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న రిషికి ప్రస్తుతం తనతో ఉంటున్న ప్రీతి (ఖుషి ఆనంద్) ప్రేమించిన అమ్మాయి కాదని తెలుసు కుంటాడు.తనతో ఉన్న అమ్మాయి ఎవరని ఇంటికి వెళ్లే లోపే తను ఎస్కెప్ అవుతుంది. అసలు రిషి ప్రేమించిన అమ్మాయి ఏమైంది, ప్రీతీ అని చెప్పుకొని రిషి తో ఉన్న అమ్మాయి ఎవరు? తను యాక్ఫిడెంట్ కాకముందు తను ఇన్వెస్టిగేషన్చేసిన కేస్ ఏంటి? ఆ నిందితులు ఎవరు? తన యాక్సిడెంట్ కు వారికీ సంబంధం ఏమిటి ? ఆ కేస్ ను ఎంక్వైరీ చేసే క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుల ద్వారా రిషి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? వారికి ఎలాంటి గుణపాఠం నేర్పాడు? చివరకు రిషి తన గతం గుర్తుకు తెచ్చుకుని ప్రేమించిన అమ్మాయిని కాపాడుకున్నాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా “ఐడెంటిటీ’ సినిమా చూడాల్సిందే.
నటీ నటుల పనితీరు:
రిషి దేవ్ గా ఏసీపీ పాత్రలో నేచురల్ గా చాలా చక్కగా నటించాడు. యువ ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ కు కావాల్సిన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. కథలో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో సహజమైన పాత్రలో వన్ మ్యాన్ షో లా చాలా బాగా నటించాడు. ఏ పి ఫార్మా లో డ్రగ్స్ ప్యాకింగ్ చేస్తూ బిజినెస్ మెన్ గా, విలన్ గా (అజయ్ )నటన బాగుంది.తక్కువ నిడివి ఉన్నా జబర్దస్త్ వీరబాబు తన నటనతో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. విలన్ కు సపోర్ట్ గా నిలిచిన వాసు, రమ్య ,హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన లత, హీరోయిన్ తమ్ముడుగా నటించిన రోహిత్ , హీరో కొలీగ్స్ రఘు తదితరులు అందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
డ్రగ్స్ తీసుకోవడం వలన యూత్ కు ఎలాంటి నష్టం జరుగుతుంది, దాని వలన మనం ఏం కోల్పోతాము అనే , డ్రగ్స్ కేసునేపథ్యంలో దర్శకుడు సునీల్ పొన్నం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు ఈశ్వర్ పెరువలి మంచి మ్యూజిక్ ఇచ్చారు.యూత్ కు మెసేజ్ ఇచ్చే పదరా సోదరా పడుతూ లేవరా అంటూ సాగే పాట, ఐటమ్ సాంగ్ ‘మేరా నామ్ మాలిని బ్యూటిఫుల్ గర్ల్ ని ఇలా ఇందులో ఉన్న పాటలు అన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ సతీష్ కుమార్ కారె అందించిన విజువల్స్ బాగున్నాయి. ఫైట్ మాస్టర్స్ మల్లేష్, శంకర్ లు అందించిన ఫైట్స్, ఛేజింగ్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.స్క్రీన్ పై కథ ఎక్కడా స్లో లేకుండా చేసిన లోకేష్ అనకాల ఎడిటింగ్ పనితీరు బాగుంది. తేజస్విని సమర్పణలో జె.వి.యమ్ పతాకంపై జె. మహాలక్ష్మి, జె. సరిత లు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా “ఐడెంటిటీ” చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. అన్ని వర్గాల వారిని కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.