Allu Arjun: రెండు ఎకరాలలో వంద కోట్లతో నూతన ఇంటిని నిర్మించిన ఐకాన్ స్టార్… ఫోటోలు వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ విధంగా మొదటి నుంచి ఎంతో స్టైలిష్ లుక్ లో ప్రత్యేకంగా కనిపించే అల్లు అర్జున్ ప్రతి విషయంలో కూడా ఎంతో లగ్జరీ గా ఉండటానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే గతంలో ఈయన కోట్ల విలువ చేసే కార్లను అదేవిధంగా ఏడు కోట్ల విలువ చేసే వోల్కాన్ వ్యానిటీ వ్యాన్ తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఆయన హైదరాబాద్లో రెండు ఎకరాలలో అందమైన ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే హైదరాబాదులో రెండు ఎకరాలలో ఏకంగా వంద కోట్లతో 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అల్లు అర్జున్ నూతన ఇంటిని నిర్మించారు.ఆ ఇంటికి అల్లు అర్జున్ ‘బ్లెస్సింగ్’అని పేరు పెట్టారు.ఈ విధంగా 100 కోట్లతో నిర్మించిన ఈ ఇంటిలో అల్లు అర్జున్ అభిరుచులకు అనుగుణంగా సమకూర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, జిమ్ సెంటర్, పిల్లల ప్లే గ్రౌండ్, ఏదైనా ప్రత్యేకమైన పార్టీలు జరిగితే పార్టీల కోసం కూడా ప్రత్యేకంగా నిర్మించుకున్నారు. ఈ విధంగా అన్ని సౌకర్యాలతో నిర్మితమైన ఈ ఇంటికి ఏకంగా వంద కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా అల్లుఅర్జున్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఇకపోతే ఈయన తన కుటుంబంతో కలిసి నిత్యం విదేశీ పర్యటనలకు వెళ్లడం లేదా… హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో లాంగ్ డ్రైవ్ వెళ్తూ పిల్లలతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నూతన ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.సహజ సిద్ధంగా లభించే తెలుపు రంగుతో ఉన్న ఈ ఇల్లు చూడటానికి ఎంతో ఆహ్లాద కరంగా ఉండటంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫోటోలో స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.