టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో గోపీచంద్ నటుడుగా, విలన్ గా బాగా మెప్పించాడు. మంచి మంచి కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను బాగా మెప్పిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రమోషన్స్ భాగం లో బిజీగా ఉన్నాడు. ఇక అందులో తన రెమ్యునరేషన్ గురించి టాపిక్ రావడంతో తన మొదటి రెమ్యూనరేషన్ రూ.11 వేలు అని అన్నాడు. ఇక ఇప్పటి వరకూ ఎవరికైనా అప్పు ఇచ్చావా అని అడిగితే.. చాలా మందికి ఇచ్చాను అని.. కొంతమందికి తిరిగి ఇస్తే.. మరికొంతమంది ఇవ్వలేదు అని అన్నాడు. వాళ్ళ పరిస్థితి చూసి తాను కూడా డబ్బులు అడగలేదు అని అన్నాడు.