Saraali Khan: నేను అది చూపించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తాను.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సారా అలీ ఖాన్?

Saraali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ సారాఅలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ‘సింబా’, ‘కేదార్‌నాథ్’ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేసి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సారా అలీ ఖాన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, తమిళ స్టార్ ధనుష్‌తో కలిసి ‘అత్రంగి రే’ చేస్తోంది. డిసెంబర్ 24న ‘జీ5’లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా సారా అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఎవరైనా నా వైపు చూస్తున్నారు అంటే అందుకు గల కారణం నేను నిజాయితీగా ఉండడమే అనే విషయాన్ని నేను గ్రహించాలని ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆ విషయాలను చెక్ చేసుకుని ఎలాంటి పొరపాట్లు తప్పులు లేకుండా మాట్లాడినప్పుడు ఎవరు నా గురించి పట్టించుకోరు.అందుకే నేను ఎన్నో తప్పులు చేశానని ఈ సందర్భంగా ఈ బ్యూటీ వెల్లడించారు.

తాను చేసిన తప్పులకు ఒక సాపేక్షత ఉంటుంది.ఇంకొన్ని సార్లు బహిరంగంగానే ఎన్నో తప్పులు చేశానని అలాంటి తప్పులు చేయడం వల్ల ఎంతో గుణపాఠం నేర్చుకున్నానని ఈ సందర్భంగా తన గురించి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా గురించి మాట్లాడిన సారా అలీ ఖాన్ నేను నా మూడ్స్‌ని చూపించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తుంటాను. అంతేకానీ, వాటికి నా మూడ్ నుకంట్రోల్ చేసే అవకాశం ఇవ్వను కనుక నీకు నచ్చితే స్టోరీస్ పెట్టు లేకపోతే పెట్టొద్దు అంతేకానీ కామెంట్స్ గురించి పట్టించుకోకు అంటూ ఈ సందర్భంగా ఈ బ్యూటీ సోషల్ మీడియా గురించి తెలిపారు.