Sudigali Sudheer: ఒక అమ్మాయితో కలిసి హోటల్ కి వెళ్లాను… అసలు విషయం బయట పెట్టిన సుధీర్!

Sudigali Sudheer: మనందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి సుడిగాలి సుధీర్ ముందుగా మ్యాజిక్ షోస్ తో ముందుకు వచ్చి అనేక రకాల మ్యాజిక్ లను చేస్తూ ఆకట్టుకున్నారు. దాని తర్వాత జబర్దస్త్ వంటి కామెడీ షో మొదట టీమ్ లో కంటెస్టెంట్ గా పనిచేసిన దాని తర్వాత తన కృషితో టీం లీడర్ గా మారాడు. అంతేకాకుండా ఒకప్పుడు పోవే పోరా వంటి ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా కూడా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అంతే కాకుండా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం నందు యాంకర్ గా చేస్తూ తన సత్తాను చాటుకుంటున్న వ్యక్తి సుడిగాలి సుధీర్ అంతేకాకుండా ఈయన సినిమాలలో హీరోగా కూడా ప్రేక్షకులను అలరించారు.

ఈయనను పులిహోర రాజా అని కూడా ప్రేక్షకులు ముద్దుగా పిలుస్తుంటారు. అంతేకాకుండా బుల్లితెర మన్మధుడిగా కూడా పిలుస్తారు.ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కామెడీ షో లో లీడర్ గా మంచి మంచి పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఈ సుడిగాలి సుధీర్ పై టీమ్ లోని పార్టిసిపెంట్స్ దగ్గరినుంచి జడ్జి అయినటువంటి రోజా వరకు అందరి అమ్మాయిల పై పరోక్షంగా పంచులు వేస్తూ ఉంటారు.తాజాగా విడుదలైన టువంటి ఎక్స్ ట్రా జబర్దస్త్ సుడిగాలి సుదీర్ ప్రోమోలో ఈ సీన్ చూసి అందరూ షాక్ కి గురయ్యారు.

ఎక్స్ ట్రా జబర్దస్త్ లోని సుడిగాలి సుధీర్ టీం లోని గెటప్ శీను తన గెటప్ లతో అలరిస్తూ, రాంప్రసాద్ తన ఆటో పంచులతో, సుధీర్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా విడుదలైన టువంటి ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్ లో సుధీర్ లాగే శ్రీను వీరిద్దరి సంభాషణ ఈ స్కిట్ కు హైలెట్ గా నిలిచింది. ఈ స్కిట్ లో గెటప్ శీను నేనునీకు ఇచ్చిన ఐదువేల రూపాయలను ఏం చేసావ్ అని అడగ్గా… దీనికి వెంటనే స్పందించిన సుధీర్ తను చేసిన పనిని అందరి ముందు బయట పెట్టేసాడు.

విషయం ఏమనగా తాను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో అమ్మాయి తడుస్తూ కారుకి ఎదురు రావడం వల్ల ఎక్కించుకొని ఒక హోటల్ రూమ్ కు తీసుకొని వెళ్లి అక్కడ బట్టల ఆరబెట్టుకున్నాం అని చెప్పేశాడు. దీంతో టీంలోని వారితో పాటు యాంకర్ రష్మీ, జడ్జి రోజా సహా అందరూ పగలబడి నవ్వు కున్నారు. ఇలాంటి మాటలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత ఇబ్బందిగా అనిపించాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.