Madhavi Latha: కాస్టింగ్ కౌచ్ కు నేను కూడా గురయ్యాను.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవీలత..!

Madhavi Latha: సినిమా పరిశ్రమలో మనకు నిత్యం వినిపిస్తున్న మాట కాస్టింగ్ కౌచ్. ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీల్లో కాస్టింగ్ కౌచ్ కామన్ అయిపోయింది. ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే ఉంటుందా అనుకుంటే పొరపాటే.. ప్రతీ వ్యాపారంలోనూ ఉంది. కాస్త గ్లామర్ గా ఎవరైనా కనిపిస్తే.. ఏ ఇండస్ట్రీలో అయినా ఇలాంటి వేధింపులు సహజంగా మారాయి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ జాడ్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనిపై శ్రీరెడ్డి, చిన్మయి వంటి వారు కూడా గళమెత్తారు. కొన్ని సంవత్సరాల క్రితం దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడిపారు.

అయితే కొంతమంది హీరోయిన్లు తాము కూడా ఈ కాస్టింగ్ కౌచ్ కు గురయ్యామని బయటకు వచ్చి ఆరోపణలు కూడా చేశారు. కానీ ఎక్కువగా సపోర్టు లేకపోవడంతో మధ్యలోనే వదిలిపెట్టారు. కానీ.. సోషల్ మీడియా వేదికగా మాత్రం దీనిపై యుద్ధాన్ని సాగిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా ముందు దీనిపై హీరోయిన్లు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇప్పటికే దీని బారిన పడిన వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ధైర్యంగా బయటకు చెబుతున్నారు.. కొంతమంది భయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. దీనిపై తాజాగా బీజేపీ నాయకురాలు , ఒకప్పుడు తెలుగు హీరోయిన్ అయినా మాధవి లతా కాస్టింగ్ కౌచ్ పై హాట్ హాట్ కామెంట్స్ చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడింది. కొంతమంది కాస్టింగ్ కౌచ్ పై పోరాతున్నారు కదా.. మీరు వాళ్లకు సపోర్ట్ చేస్తారా అని విలేకరి అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పారు. ఏ పని చేసినా.. కమిట్ మెంట్ అనేది ఉండాలి. కానీ సినీ పరిశ్రమలో దానిని ఒక చెడ్డ పనికి వాడేస్తున్నారన్నారు. అయితే తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని.. ఆ అనుభవం గురించి చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఇదే విషయాన్ని కొన్ని రోజుల ముందు చెప్పే సమయంలో తాను కన్నీళ్లు కూడా పెట్టుకున్నానన్నారు. ఎవరైతే తనను అలా అడిగారో.. ఆ విధానం అర్థం కావడానికి 24 గంటల సమయం పట్టిందట. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ కు షేర్ చేస్తుంటే.. పొరపాటున అతడి సెల్ ఫోన్ కు ఆ మెసేజ్ వెళ్లిందట. తరువాత ఏమిజరిగిందో మీకు తెలిసిందే అని ఆమె చెప్పుకొచ్చారు.