Actor Davood: రొమాంటిక్ సినిమాలు నేను నటించాల్సి ఉంది… కానీ అలా తప్పుకోవాల్సి వచ్చింది!

Actor Davood: తాను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ తనకు మంచి పేరు తీసుకు వచ్చిందని నటుడు దావూద్ అన్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారికి అంత ముందు వరకు హిట్స్ లేవని, ఈ సినిమాతో ఆయనకి పెద్ద హిట్ వచ్చిందని తెలిపారు. ఆ సినిమాలో తాను ఒక క్యారెక్టర్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు. షియాజీ షిండేతో చేసిన ప్రతి సీన్లోనూ తాను ఉంటానని హీరోతో చేసిన చాలా సీన్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయని ఆయన అన్నారు.

ఒక సినిమా పెద్ద హిట్ అయినప్పుడు ఆ సినిమాలో మనం చేస్తే అది చిన్న క్యారెక్టర్ అయినా సరే అది ప్రజల్లో గుర్తింపును ఇస్తుందని దావూద్ అన్నారు. పబ్లిక్ కంటే ముందు ఇండస్ట్రీలోని పెద్దల కళ్ళల్లో పడాలని తాను ఎప్పుడూ అనుకుంటానని దావూద్ తెలిపారు. ఎందుకంటే వాళ్లు గుర్తించడం వల్ల అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఆ సినిమా హిట్ కావడంతో అది పెద్ద క్యారెక్టర్ కాకపోయినా తనకు మంచి పేరు తీసుకు వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే పూరి జగన్నాథ్ గారి కొడుకు తీసిన రొమాంటిక్ సినిమాలో కూడా తాను చేయాల్సిన పని గోవాలో కొంత వరకు షూటింగ్ కూడా చేశామని దావూద్ చెప్పారు. కానీ అదే సమయంలో తనకు డేట్స్ కుదరక పోవడం వల్ల మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో ఆ సినిమాను చేయలేకపోయానని ఆయన అన్నారు.