Hema: కరోనా సమయంలో చిరంజీవి గారు చాలా బాగా స్పందించారని, కనిపించే దేవుడిలాగా అనిపించారని నటి హేమ అన్నారు. కళ్లముందుండి తమ కష్టాలను చిరంజీవి గారు గట్టెక్కించారని ఆమె చెప్పారు. ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నా, ఏదైనా సినిమా లేదా ప్రోగ్రామ్ చేద్దామనుకుంటున్నా అనుకుంటే మాత్రం నాగార్జున గారు అని హేమ తెలిపారు. అది ఎప్పుడైనా సరే అని, సంవత్సరంలో ఒక 2,3 సార్లు కాల్ చేస్తూ ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తాను అందరితోనూ ఎప్పుడూ టచ్‌లో ఉంటానని చాలా మంది అనుకుంటారు గానీ, అదేం కాదని ఆమె అన్నారు.
నిజంగా మనకు అవసరం ఉంది అనుకున్నపుడు, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు మాత్రమే వాళ్లకు ఫోన్ చేస్తానని ఆమె చెప్పారు. లేదంటే ఒక వేళ కలవాలి అనుకుంటే ఆయన పర్మిషన్ తీసుకొని, వాళ్లకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడే కలిసి వస్తానని ఆమె అన్నారు.
ఇకపోతే తాను బ్యూటీపార్లర్ పెడుదామని అనుకున్నపుడు ఒక బ్రాండ్ తీసుకున్నానని అన్నపుడు నాగార్జున గారు ఏమన్నారంటే, నువ్వెందుకు బ్రాండ్ తీసుకోవాలి, హేమనే ఒక బ్రాండ్, నువ్వు ఇంకొక బ్రాండ్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ పెట్టుకున్నా జనాలు నీ దగ్గరికి వస్తారు, సైడ్ ఇన్‌కం కింద నీ బ్రాండే పనిచేస్తుందని చాలా సింపుల్‌గా చెప్పి పంపించేశారని ఆమె తెలిపారు. ఆ తర్వాత తాను బ్యూటీపార్లర్ పెట్టి, కొంత మంది మనుషులను పెట్టి నడిపిస్తున్నానని ఆమె చెప్పారు. దానికి ఒక పబ్లిసిటీ ఇచ్చి, నాదీ అని చెప్పుకోవడం లాంటివేవీ జరగలేదని ఆమె స్పష్టం చేశారు.