Aliya Bhat: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో బాలీవుడ్ చిత్రాలలో నటించి మొట్ట మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా అలియా కుటుంబ సభ్యులు మొత్తం అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చూసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో అలియా భట్ కుటుంబ సభ్యులు మొత్తం అల్లు అర్జున్ కి అభిమానులుగా మారిపోయారని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మా కుటుంబ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుందని ఈ ముద్దుగుమ్మ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ తో కలిసి నువ్వు ఎప్పుడూ నటిస్తావని తన కుటుంబ సభ్యులు తనని అడుగుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే తనకు అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఆ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోనని ఈ సందర్భంగా ఆలియా తెలియజేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవడమే కాకుండా ఓటీటీలో కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న బన్నీకి అలియా కుటుంబ సభ్యులు సైతం అల్లు అర్జున్ కు వీరాభిమానులుగా మారిపోయారని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ గురించి ఆలియాభట్ చేసిన ఈ వ్యాఖ్యలపై అల్లుఅర్జున్ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.