బాలయ్యకు డాన్స్ నేర్పించాను.. షోలో ఎమోషనల్ అయిన నటి అర్చన?

తెలుగు సినీ ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ అర్చన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ,కన్నడ,తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది నటి అర్చన. కానీ అర్చనకు అందం, అభినయం, టాలెంట్ అన్ని ఉన్నప్పటికీ ఆమెకు అంతగా అవకాశాలు కలిసి రాలేదు. ఇక ఆమెకున్న క్రేజీతో బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బిగ్ బాస్ ఆమె కెరీర్ కు ప్లస్ పాయింట్ కాలేకపోయింది. ఆ తర్వాత అర్చన నేను,నువ్వొస్తానంటే నేనొద్దంటాన,శ్రీరామదాసు లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అర్చన. ఆ తర్వాత ఈమె హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్‌ జగదీష్ భక్తవత్సలం ను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా షోకు తన భర్తతో కలిసి గెస్ట్‌గా వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. శ్రీరామదాసు సినిమా చేస్తున్న సమయానికి నాకు వయసు కూడా లేదు. ఆ క్రెడిట్ మొత్తం నా క్లాసికల్ డ్యాన్స్‌కే వెళుతుంది. రాఘవేంద్ర రావు సార్ గారితో వర్క్ చేయడం చాలా అదృష్టం. మళ్లీ ఎప్పుడు చేస్తానో.. రాఘవేంద్ర సార్ చెప్పండి అంటూ అర్చన నవ్వుతూ చెప్పుకొచ్చింది. అయితే తాను పెళ్లికి ముందు ఫ్రెండ్‌తో పార్టీకి వెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్‌గా హాస్పిటల్‌కు వెళ్లిన విషయం ప్రస్తావించగా అర్చన భర్త జగదీష్ స్పందిస్తూ..నేను ఉన్నాను కదా.. ఎంజాయ్ చేయు అని చెప్పా. నాకు తెలియదు తన క్యాపాసిటీ. ఫుల్‌ అయిపోయింది అంటూ గుర్తుచేశారు.

అలాగే బాలయ్య బాబుకు కొరియోగ్రాఫింగ్ నేర్పించిన విషయంపై అర్చన స్పందిస్తూ బృందావనంలో గోపికలతో డ్యాన్స్ చేసే చిన్న బిట్ ఉంటుంది. అది నేను చెప్తే బాలకృష్ణ గారు చేశారు. ఆ తర్వాత ఆయన సూపర్బ్ బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు.

అని తెలిపింది నటి అర్చన. యమదొంగ సినిమాలో ఓ సాంగ్ చేశా. తరువాత రాజమౌళి డైరెక్షన్‌లోనే మగధీర సినిమాలో ఓ రోల్ కోసం ఆఫర్ వచ్చినా చేయలేదు. బ్రెయిన్ చిన్నది. లౌక్యం తక్కువ అప్పుడు. ఇప్పుడు మెచ్చురిటీ పెరిగింది. మగధీరలో ఆ క్యారెక్టర్ చేసిఉంటే రాజమౌళి గారు కచ్చితంగా అవకాశం ఇచ్చేవారు అని తెలిపింది అర్చన. అదేవిధంగా పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చి లాస్ట్ మూమెంట్ లో డ్రాప్ అయినవి ఉన్నాయా అని అలీ అడగగా ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది అర్చన.