Actor Tarzan: తనికెళ్ల భరణి గారికి డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తుంటే నేను సెటిల‌్మెంట్ చేశా: ఆర్టిస్ట్ టార్జాన్

Actor Tarzan: రామ్ గోపాల్ వర్మ దగ్గర దౌడ్ షూటింగ్ జరుగుతున్నపుడు ఆయన వచ్చి తనను బండిలో కూర్చో అని చెప్పగానే వెంటనే వెళ్లి కూర్చున్నానని ఆర్టిస్ట్ టార్జన్ అన్నారు. ఆయన ఒక బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి 8వ అంతస్థులో ఒకడుంటాడు వెళ్లి వాన్ని భయపెట్టు అని అన్నారని ఆయన చెప్పారు. తనకు అది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అలాగే అనుకుంటా ఆయనమీద ఉన్న భయం, గౌరవంతో 8వ ఫ్లోర్‌కి వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాల్ కిదర్‌హై అనే డైలాగ్ చెప్పి గన్ తీయగానే అతను వెంటనే షాక్ అయ్యి, చాలా భయపడిపోయాడని ఆయన నవ్వుతూ చెప్పారు. అలా చెప్పమని ఆయన ఏం చెప్పలేదని టార్జన్ అన్నారు. అలా తాను ఇద్దరిని భయపెట్టానని ఆయన సరదాగా అన్నారు.

ఆ తర్వాత ఇలాంటి సంఘటనే తనికెళ్ల భరణి విషయంలో జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. తాను హైదరాబాద్‌లో ఉన్నపుడు చెన్నైలో ఉన్న తనికెళ్ల భరణి గారు ఫోన్ చేసి ఒకసారి చెన్నై రావాలని అడిగారని, ఎందుకు అని అడిగితే చిన్న పని ఉందని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఇకపోతే భీమరాజు అనే ఆర్టిస్టుతో కొంచెం సెటిల‌్మెంట్ చేసేందుకని ఆ తర్వాత తనకు అర్థమైనట్టు ఆయన చెప్పారు.

అలా చెన్నై వెళ్లి, ఆ వ్యక్తిని కలిసి, భరణి గారికి డబ్బులు ఇవ్వాలంట కదా.. ఏం సంగతి అని అడిగి, నీ ఫ్లాట్ ఉంది కదా దాన్ని ఆక్రమించుకుంటామని బెదిరించగానే ఆయన చాలా భయపడిపోయాడని టార్జన్ అన్నారు. అయితే ఆ తెల్లారే భరణి గారు ఫోన్ చేసి, అతనికి ఏం చెప్పావయ్యా వాడు డబ్బులిచ్చాడని చెప్పినట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా మనం మనం ఒకటి సర్, ఆయన్నెందుకు పిలిచారు.. నేను ఇచ్చేస్తాను డబ్బులు అని చెప్పి భరణి గారికి చెప్పి మరీ మనీ ఇచ్చాడని ఆయన వివరించారు. అలా తాను చాలా మందికి హెల్ప్ చేశానని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు అందరూ పెద్దవాళ్లయిపోయారు.. ఎవరూ అది గుర్తు పెట్టుకోరు అని, ఇండస్ట్రీలో అలా కొందరు వాడుకొని వదిలేస్తారని ఆయన అన్నారు. ఇక్కడ మంచితనం అనేది ఉండదని, అంతా స్వార్థమే ఉంటుందని, ఆ టైం అయిపోతే అందరూ మరచిపోతారని ఆయన స్పష్టం చేశారు.