Bahubali: నాకు బాహుబలి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..ఆర్టిస్ట్ మేక రామకృష్ణ!

Bahubali: బాహుబలి అనే సినిమా తీస్తున్నారని తెలిసి తాను ఆడిషన్‌కు వెళ్లానని ఆర్టిస్ట్ మేక రామకృష్ణ అన్నారు. అసలు ఆ సినిమాకు తాను సెలెక్ట్ కావడానికి ముఖ్య కారణం కె.ఎల్.ప్రసాద్ అనే డైరెక్టర్ అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఈ మధ్యే స్ర్కీన్‌ ప్లే అనే సినిమా తీశారన్న రామకృష్ణ, ఆయనే పర్సనల్‌గా తనను తీసుకెళ్లి విజయేంద్ర ప్రసాద్‌కు పరిచయం చేసి, ఇతను మంచి ఆర్టిస్ట్, స్టేజ్ డ్రామాలు చేస్తుంటారు, ఈయన ఆడిషన్ తీసి రాజమౌళి గారికి చూపించాలని ప్రసాద్ అన్నట్టు రామకృష్ణ తెలిపారు. అయితే ఆయన చెప్పినట్టుగానే ఒక 25నిమిషాల పాటు వివిధ రకాలుగా ఆడిషన్ చేసిన తర్వాత ఆ క్యాసెట్ రాజమౌళి గారికి పంపించడం జరిగిందని ఆయన చెప్పారు.

ఇకపోతే అది చూసిన రాజమౌళి తనకు నచ్చడంతో నన్ను పిలిపించారని రామకృష్ణ తెలిపారు. తనను పిలిపించి ఈ సినిమాలో 2,3 క్యారెక్టర్స్ ఉన్నాయి చేస్తారా అని తనను అడిగారని, అసలు మీ దగ్గరికొచ్చి మాట్లాడడమే తమ అదృష్టమని, ఇంకా చేస్తారా అని అడగమేంటండి, తప్పకుండా చేస్తానని తాను చెప్పినట్టు ఆయన వివరించారు. గుండు కొట్టిస్తారా అంటే కొట్టిస్తారని, గడ్డం పెంచుతారా అంటే పెంచుతా అని సమాధానమిచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే 2ఏళ్లు ఏం చేయడానికి వీల్లేదు. నేను పిలిచినపుడు రావాలని రాజమౌళి చెప్పగానే దానికి తాను కూడా వస్తానండీ అని చెప్పినట్టు రామకృష్ణ చెప్పారు.

అలా గడ్డం పెంచమన్నారని చెప్పడంతో 3నెలలు పెంచాక, ఒక రోజు మళ్లీ ఫోన్ చేసి రామకృష్ణ గారు గడ్డం పెంచారా లేదా కనుక్కోమని చెప్పడంతో తాను ఫొటోలు పంపించానని, అది చూసి నైస్ అన్నారని, అంటే తాను క్యారెక్టర్‌లో ఉన్నారా, లేదా అని తెలుసుకోవడానికి అడిగారని ఆయన చెప్పారు. అలా దాదాపు 7,8 నెలలు పెంచాక ఒక రోజు పిలిచి రిహాల్సస్‌ చేయాలని చెప్పడంతో తాను వెళ్లానని, అక్కడ రానా, ప్రభాస్, అనుష్క కూడా ఉన్నారని ఆయన తెలిపారు. అలా తనకు బాహుబలి సినిమాలో అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు.