Regina: తెలుగు ఇండస్ట్రీ లోకి ఎస్ఎంఎస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా నటుడు సందీప్ కిషన్ తో కూడా జోడీ కట్టి సినిమాల్లో అలరించారు. ఇప్పటికే రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య అనే మూవీస్ తో సందడి చేసిన రెజీనా, గత సంవత్సరం నారా రోహిత్ శంకర అచ్చుతానంద చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలాంటి రెజీనా జీవితంలో కూడా చేదు అనుభవాలు లేకపోలేదు.
ఇక వివరాల్లోకి వెళితే మలయాళ నటి కిడ్నాప్, వేధింపుల విషయంపై సామాజిక మాధ్యమాలు, మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు హీరోయిన్స్ తమ జీవితంలో జరుగుతున్న లైంగిక వేధింపులు గురించి ప్రస్తావిస్తున్నారు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా తనపై లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు.
తాజాగా రెజీనా కూడా ఈ విషయంపై స్పందించి, ఏడేళ్ల క్రితం సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఫోన్ చేసి చెప్పారట. సినిమాల్లో ఛాన్స్ ఇస్తాం కానీ పడక సుఖం అందించాలని పరోక్షంగా చెప్పారట. దాంతో రెజీనా వెంటనే ఫోన్ పెట్టేసారట. ఈ విషయాన్ని తన మనసులోనే ఇన్నాళ్లూ దాచుకుని కుమిలిపోతుండే దాన్ని అని ఆమె అన్నారు. దానిని తాజాగా భావన విషయంలో జరిగిన అన్యాయాన్ని, ఆమె చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాలనిపించి రెజీనా అన్నారట. ఇక బాలీవుడ్ లో కూడా కంగనా రనౌత్ ఈ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు ప్రస్తావించారు. తాను సినిమాల్లోకి రాక ముందు చాలామంది పడక సుఖం అనుభవించారని బాహాటంగానే చెప్పారు కంగనా.