పెళ్లి చేసుకుని విడాకులతో విడిపోవడం ఇష్టం లేదు.. పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిష?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంది అగ్ర హీరోల సరసన నటించిన నటి త్రిష గురించి పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ విధంగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన త్రిష తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన త్రిష ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది నీ పెళ్ళెప్పుడు అని ప్రశ్నిస్తే తనకు చాలా కోపం వస్తుందని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారుని ప్రశ్నిస్తే మాత్రమే తన సమాధానం చెబుతానని వెల్లడించారు.పెళ్లి బంధం పై తనకు నమ్మకం లేదని తన చుట్టూ పెళ్లి జీవితంలో అసంతృప్తిగా జీవించే వాళ్లే ఉన్నారని ఈమె వెల్లడించారు.

పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం ఒక వ్యక్తి జీవితాంతం నాకు తోడుగా ఉంటారు అనే భావన నాలో కలిగినప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని అలాంటి వ్యక్తి కోసమే తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇకపోతే పెళ్లి తర్వాత విడాకులు అనేది నాకు నచ్చవు. ఎంతోమంది పెళ్లిళ్లు చేసుకొని విడాకులతో విడిపోయిన వారు ఉన్నారు. అందుకే తాను పెళ్లి విషయంలో తొందరపడదలుచుకోలేదంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.