ఆ హీరో పిలిచే విధానం ఏ మాత్రం నచ్చదు.. బాలీవుడ్ హీరో గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్న ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన రష్మిక ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తాను యానిమల్ సినిమా షూటింగ్ లొకేషన్ లోకి అడుగు పెట్టగానే రణబీర్ కపూర్ ని చూసి కాస్త నెర్వస్ గా ఫీల్ అయ్యాను. అయితే అతనితో మాట్లాడిన ఐదు నిమిషాలకు అంతా సెట్ అయిందని రష్మిక వెల్లడించారు. ఇకపోతే ఆయన ఎంతో మంచి వ్యక్తి అంటూ ఈ సందర్భంగా హీరోపై ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే ఇప్పటివరకు తనని సినిమా ఇండస్ట్రీలో ఎవరూ కూడా మేడమ్ అని పిలవలేదు. నన్ను మేడమ్ అని పిలిచిన ఏకైక హీరో రణబీర్ కపూర్. ఈ విధంగా హీరో తనని మేడమ్ అని పిలవడం తనకు ఏమాత్రం నచ్చలేదని ఈ సందర్భంగా రష్మిక రణబీర్ కపూర్ గురించి వెల్లడించారు. ప్రస్తుతం రష్మిక చేస్తున్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో అల్లుఅర్జున్ పుష్ప 2, విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విజయ్ 66 సినిమాలో కూడా నటిస్తున్నారు.