Kaushal Manda: ఆఫీసుల చుట్టూ తిరిగే సమయం నాకు లేదు… నేను చాలా బిజీ…. కౌశల్ కామెంట్స్ వైరల్!

Kaushal Manda: బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కౌశల్. అయితే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు దాదాపుగా 86 సినిమాల్లో నటించాడు. అయినప్పటికీ కౌశల్ కి తగిన గుర్తింపు దక్కలేదు. బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వడంతో పాటు, మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇది అన్ని సినిమాల్లో నటించినప్పటికీ కౌశల్ కి తగిన గుర్తింపు దక్కలేదు. బిగ్ బాస్ షో తర్వాత అయిన అతని లైఫ్ మారుతుంది అనుకుంటే అతని యాటిట్యూడ్ వల్ల సినిమాలకు దూరం అవుతూనే వచ్చాడు.

తన క్రేజ్ కి తగ్గట్టుగా దర్శకనిర్మాతలు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడంతో తను సినిమాలలో నటించడం లేదు అని చెప్పుకొచ్చాడు కౌశల్. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ.. నేను 86 సినిమాలలో నటించాను.. కానీ మంచి గుర్తింపు మాత్రం దక్కలేదు. నేను సినిమాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.. దర్శకనిర్మాతల వద్దకు వెళ్లి నాకు సినిమా ఛాన్స్ ఇవ్వండి అని నేను అడగను.. నాకు ఎవరైనా ఫోన్ చేసి పాత్ర ఉంది చేయమంటే చేస్తాను అంతేగాని.. తనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వమనీ అడుక్కోను.. కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు.

కానీ నేను అలా కాదు అని తెలిపాడు కౌశల్. నన్ను, నా స్టైల్ ని, నా టాలెంట్ ని చూసి నాకు ఆఫర్ ఇవ్వాలి తప్పితే.. నేను వెళ్లి ఛాన్స్ ఇవ్వండి అని అనుకోను.. అలాంటి అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు కూడా ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రతిరోజు సూట్స్ ఉంటాయి. ఫ్యాషన్ షోస్ కూడా ఉంటాయి.యాడ్స్ రూపంలో.. ఏదో ఒక విధంగా ఏదో ఒకటి నేను చేస్తూనే ఉంటాను.. ఎప్పుడు బిజీగా ఉంటాను.. ఖాళీగా ఉండను అని చెప్పుకొచ్చాడు కౌశల్. అదేవిధంగా ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే సమయం నాకు లేదు నేను చాలా బిజీ అని తెలిపాడు కౌశల్.