Malavika:ఆ రేప్ సీన్ నాకు నచ్చలేదు… మా పేరెంట్స్ నాపై కోపడ్డారు… నటి మాళవిక షాకింగ్ కామెంట్స్!

Malavika: హీరో శ్రీకాంత్ సరసన చాలా బాగుంది ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మాళవిక గురించి మనకు తెలిసిందే. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సుమారు 12 సంవత్సరాల తర్వాత తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఎన్నో విషయాలను ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలను ముచ్చటించారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా చాలా బాగుంది సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తనకు శ్రీకాంత్ కు మధ్య గొడవ జరిగిందని ఒక రొమాంటిక్ పాట చిత్రీకరిస్తున్న సమయంలో నేను కంఫర్ట్ గా లేకపోవడం వల్ల అదే విషయాన్ని శ్రీకాంత్ తో చెబితే అతను కోపంగా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారని మాళవిక తెలియజేశారు.అదేవిధంగా ఈ సినిమాలో రేప్ సన్నివేశం తనకు నచ్చలేదని తనని ఒక నెగిటివ్ పాత్రలో చూపించిందని తెలిపారు.

ఇక తాను తమిళంలో 35 సినిమాలో నటించానని అయితే తన జీవితంలో నటించిన సీ యూఎట్ నైట్ అనే సినిమాలో చాలా ఎక్స్పోజింగ్ పాత్రలో నటించాననీ, ఇప్పటికీ ఈ సినిమాలో ఎందుకు నటించానా అని బాధపడుతూ ఉంటానని, ఈ సినిమాలో నటించినందుకు మా పేరెంట్స్ కూడా నాపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఈ కార్యక్రమం ద్వారా మాళవిక తెలియజేశారు.