Nikhil – Pallavi: నిఖిల్ ప్రపోజ్ చేస్తే అస్సలు నమ్మలేదు… అసలు విషయం చెప్పిన నిఖిల్ భార్య పల్లవి!

Nikhil – Pallavi: హ్యాపీడేస్ చిత్రం ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైన హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఎంతోమంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న నిఖిల్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే హీరో నిఖిల్ 2020 సంవత్సరంలో తాను ప్రేమించిన పల్లవి అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కరోనా కావటం వల్ల ఈ జంట ఎంతో నిరాడంబరంగా వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఇప్పటివరకు వీరిద్దరూ ఏ ఇంటర్వ్యూలో పాల్గొనలేదు.

ఈ క్రమంలోనే తాజాగా వాలెంటెన్స్ డే సందర్భంగా నిఖిల్ తన భార్య పల్లవితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈ జంట ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి బయటపెట్టారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ పల్లవిని మొదటిసారిగా ఒక బర్త్ డే పార్టీలో చూశానని,ఇలా తనని పార్టీలో చూడగానే అందరికన్నా ఏదో స్పెషల్ అనిపించడం వల్ల తన చుట్టే తిరిగానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే తన ఫ్రెండ్ కి పల్లవి ఫ్రెండ్ కావడంతో తన నెంబర్ అడిగితే తను ఇవ్వలేదని కూడా తెలియజేశారు.

ఇక ఇంస్టాగ్రామ్ లో ఈమె ప్రొఫైల్ చూసి తనని ఫాలో అయ్యానని ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా తనతో పరిచయం ఏర్పర్చుకొని తనని కలిసి తన ఫోన్ నెంబర్ తీసుకున్నానని తెలిపారు.మొదటిసారిగా నేను ప్రపోజ్ చేసినప్పుడు పల్లవి అసలు నమ్మ లేదనే విషయాన్ని నిఖిల్ వెల్లడించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ నిజంగానే తను ప్రపోజ్ చేస్తే నేను నమ్మలేదని జోక్ చేశారనుకున్నానంటూ ఈ సందర్భంగా పల్లవి వారి ప్రేమ గురించి వెల్లడించారు. ఇక నిఖిల్ కి పల్లవి నవ్వు అంటే ఎంతో ఇష్టమని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.