Adire Abhi: ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి మీద స్కిట్ చేశాను.. అసలు ఎందుకు చేశానా అని ఇప్పటికీ బాధపడుతున్నా.. అదిరే అభి!

Adire Abhi: డబల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ, కొందరు ఆడియన్స్‌ను నవ్వించడం కోసం మరికొందరిని హర్ట్ చేయడం లాంటివి చేయకూడదు. దాని వల్ల పేరు వస్తుందా, రాదా అన్నది తరువాత విషయం. కానీ అందరూ చూసేలా చేద్దాం. అందరూ చూడాలా వద్దా అనేది వాళ్లిష్టం. జబర్దస్త్ తనకు అదిరే అభి అనే పేరు ఇచ్చిందని, అందుకోసం తాను కూడా రిటర్న్‌గా జబర్దస్త్‌కు ఏదైనా చేయాలి కదా అని అభి అన్నారు. తాను ఇప్పుడు గర్వంగా చెప్పుకోదగిన విశేషమేమిటంటే, అభి అనే వ్యక్తి దాదాపు 15 విభిన్న రకాల స్కిట్స్ చేశాడు. అంటే వేళ్ల మీద చెప్పగలిగేలా వివిధ స్కిట్స్ చేశానని ఆయన గర్వంగా చెప్పుకున్నారు.

ఇకపోతే రేపు ఎవరన్నా వచ్చి జబర్దస్త్‌లో అన్నీ బూతు స్కిట్స్ ఉంటాయి. డబల్ మీనింగ్ డైలాగులుంటాయి. అది చాలా వల్గర్ షో అని చాలా మంది అంటుంటారని, అలా మాట్లాడుకునే వాళ్లకి తాను చెప్పేదేంటంటే.. తాను చేసిన స్కిట్స్‌లో అలాంటివేం ఉండవని, దాదాపు అన్నీ అవగాహన కల్గించే అంశాలను తీసుకొని మాత్రమే తాను స్కిట్స్ చేశానని అదిరే అభి స్పష్టం చేశారు. దాని వల్ల తనకు పేరు వస్తుందనో, ఇంకేదైనా రావాలనో తాను చేయలేదని, తనకు వచ్చింది చేయాలనుకున్నాను అంతేనని ఆయన చెప్పారు.

తాను ఇప్పటివరకు చేసిన స్కిట‌్స్‌లో తోలు బొమ్మల స్కిట్‌కి చాలా కష్టపడ్డానని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా తాను ఇప్పటివరకు చాలా స్కిట్స్‌ చేశానని, అందులో ఒక్క స్కిట్ మాత్రం చేయకుండా ఉంటే బాగుండునని అనిపించిందని అదిరే అభి అన్నారు. 2014లో చేసిన ఒక స్కిట్ వల్ల సినీ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరో హర్ట్ అయ్యారని, నిజానికి తాను అలా చెయ్యడం తప్పేనని ఆయన చెప్పారు. అలా హర్ట్ చేసినందుకు నిజంగా ఇప్పటికీ తాను ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటానా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.