Geetha Bhaskar: ఎంతో సహజంగా, మేకప్ లేకుండా నటించే విషయంపై ఆర్టిస్ట్ గీత ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మొదటి నుంచీ తనకు మేకప్ అంటే ఇష్టం ఉండదని, అందుకే సినిమాల్లోనూ వేసుకోకుండా చేశానని ఫిదా ఫేమ్ ఆర్టిస్ట్ గీత అన్నారు. తను అనుకున్న దాని ప్రకారం తనకు అవకాశాలు ఇక రావని అని ఆమె చెప్పారు. ఎందుకంటే తాను ఆ దిశగా ఎక్స్ పెక్ట్ చేయలేదని, చేయనని కూడా అని ఆమె తెలిపారు. అసలు తనకు ఆ ఫ్లెక్సిబిలిటీనే లేదని ఆమె చెప్పారు. ఐనా మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ రావాలి, పిలవాలి కదా అని ఆమె అన్నారు. తాను కూడా ఫిల్మ్ ఫీల్డ్ లో వెళ్ళాలని కోరుకోలేదని ఆమె చెప్పారు.
ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి .. ఈమెనే చేయాలి అని ఎవరైనా అడిగితే మాత్రం తప్పకుండా నటిస్తానని ఆమె స్పష్టం చేశారు. లేకపోతే అసలు తాను అసలు ఈ సినీ ప్రపంచంలో ఉండడం ఏంటీ అని అనిపిస్తూ ఉంటుందని ఆమె చెప్పారు.
ప్రస్తుతం తాను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానన్న గీత, త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆమె తెలిపారు. తాను ఇంతకు ముందు కూడా కరోనా లాక్ డౌన్ కు ముందు ఒక వెబ్ సిరీస్ లో నటించనున్న ఆమె, ఇప్పుడు స్టోరీ నచ్చి ఈ సిరీస్ కి ఒప్పుకున్నానని ఆమె వివరించారు.