Vennela Kishore: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్లకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఇలా కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో వెన్నెల కిషోర్ ఒకరు. ఇటీవల వెన్నెల కిషోర్ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను తన కామెడీ ద్వారా మెప్పిస్తున్నారు. ఇకపోతే తాజాగా వెన్నెల కిషోర్ శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెన్నెల కిషోర్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు . ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. దూకుడు సినిమాతో తన లైఫ్ మొత్తం టర్న్ అయిందని తెలిపారు.
దూకుడు సినిమాకు కమిట్ అయిన తర్వాత డైరెక్టర్ శీను వైట్ల గారు నన్ను చాలా వరకు లావు తగ్గమని చెప్పారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మహేష్ బాబు పక్కన ఉండే పాత్ర. ఈ సినిమాలో అందరూ స్లిమ్ గా ఉంటారు కానీ మీరు మాత్రం చాలా లావుగా ఉన్నారు అందుకే మీరు బరువు తగ్గడానికి లైపో సర్జరీ చేయించుకోమన్నారు. సర్జరీకి కావాల్సిన డబ్బులు కూడా తానే ఇస్తానని శ్రీను వైట్ల తెలిపారు.
ఇలా సర్జరీ చేయించుకోమని చెప్పగా నేను నేచురల్ గానే తగ్గుతానని చెప్పాను కానీ నేచురల్ గా తగ్గలేదు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఇలా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత లావు తగ్గకపోయినా పర్లేదు ఇలానే బాగుందని చెప్పారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ ప్రభాస్ వంటి హీరోల రేంజ్ భారీగా పెరిగిపోయిన అలాంటి హీరోల సినిమాలలో నేను నటించలేనని తెలిపారు.
ఆ హీరోల సినిమాలో తనకు సరైన క్యారెక్టర్స్ రాయడం సాధ్యం కాదు కదా అని వెన్నెల కిశోర్ చెప్పుకొచ్చాడు. వారి సినిమాల్లో తాను ఊరికే నిలబడి చూడటం తప్పితే చేసేదేం ఉండని అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ఈ హీరోల సినిమాలలో నటించడం లేదు అంటూ వెన్నెల కిషోర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
