Hema: తన పుట్టిన రోజుకి విష్ణు తనకు ఫోన్ చేసి, తనకు విషెస్ చెప్పారని నటి హేమ అన్నారు. అయితే మాటల్లో మాటగా స్టాఫ్ నీ మారుస్తున్నాము అని దాని గురించి మాట్లాడారని ఆమె చెప్పారు. వాళ్ళు రాలేదు.. కాబట్టి ఇంకా ఎన్ని ఇలా వారి కోసం ఎదురు చూడాలి అని చెప్పినట్టు ఆమె తెలిపారు.
ఇకపోతే తాను తనకు బర్త్డే కి ఒక గిఫ్ట్ కావాలని విష్ణుని అడిగినట్టు హేమ చెప్పారు. ఏంటమ్మా చెప్పు అని అడిగితే, దానికి తాను ఈ విధంగా సమాధానం చెప్పినట్టు ఆమె చెప్పారు. శ్రీనిజ అనే ఆవిడని బ్యాన్ చేశామని, కార్డ్ కూడా తీసివేస్తున్నట్లు చెప్పామని హేమ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆమె ఎమోషనల్ గా మాట్లాడి, నోరు జారిందని ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు ఆవిడ ఉన్న కండిషన్స్ లో ఆవిడకి పెన్షన్ అవసరం అని, మెడికల్ క్లైమ్ అవసరం అని హేమ చెప్పారు. కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే కూడా ఆమె హెల్త్ బాలేదని తెలుస్తుందని, ఇప్పుడు ఆమెకు మా అసోసియేషన్ కార్డ్ చాలా అవసరం అని, మామూలుగా తాను దానికి లెటర్ పెడుదామని అనుకున్నా, కానీ తాము ఏ లెటర్ ఇచ్చినా అది మీడియా ద్వారా బయటికి వచ్చేస్తుంది అని హేమ చెప్పినట్టు ఆమె తెలిపారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ సమయంలో ఇదొక ఇష్యూ అవుతుందని పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు.
దానికి విష్ణు సమాధానంగా లేదమ్మా మీరు లెటర్ పెట్టండి. ఇంతకు ముందులా కాదు ఏదీ బయటికి వెళ్లదు అని చెప్పినట్టు హేమ తెలిపారు. ఇప్పుడే కాదా దీని గురించి మాట్లాడాము, ఒక 2 నెలలు టైం ఇవ్వండి. ఆవిడకు కార్డ్ ఇవ్వడం, మెడికల్ క్లైమ్ లేదా పెన్షన్ అనేది ఆలోచించి తప్పకుండా ఆమెకు ఏమైనా చేద్దామని తనకు విష్ణు మాట ఇచ్చినట్టు హేమ వివరించారు.