Sumanth: కీర్తిరెడ్డి నాతో విడాకులు తీసుకున్నా..ఇంకా నాకు టచ్‌లోనే ఉంది… సుమంత్ షాకింగ్ కామెంట్స్!

Sumanth: ఇటీవల నటుడు సుమంత్ నటించిన చిత్రం మళ్లీ మొదలైంది మూవీలో కథ తన లైఫ్‌కు దగ్గరగా ఉండకపోవచ్చు, గానీ క్యారెక్టర్ మాత్రం కొంచెం అలాగే ఉంటుందని సుమంత్ చెప్పారు. బ్రేకప్ అయినవాళ్లు గానీ, డివోర్స్ అయినవాళ్లు గానీ కచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని ఆయన చెప్పారు.

ఇకపోతే తన విషయానికొస్తే తన డివోర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా అయిందని, అలా జరగడం చాలా అరుదుగా జరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా తాము ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గా టచ్‌లో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే తాను నటించిన ఈ మళ్లీ మొదలైంది చిత్రంలోనూ విక్రమ్, ఈషా క్యారెక్టర్స్ మధ్య విడాకులైనా కూడా వాళ్లిద్దరి మధ్య మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటుందని ఆయన చెప్పారు.

ఇక తన లైఫ్‌స్టైల్ విషయానికొస్తే చాలా డిసిప్లెన్‌గా ఉంటానని సుమంత్ తెలిపారు. వారంలో 5 రోజులు తప్పకుండా వ్యాయామం చేస్తానని, తమ వృత్తికి అది తప్పనిసరి అని ఆయన తెలిపారు. తనకు వ్యాయామం చేయడం కూడా ఇంట్రస్ట్ అని, దాంతో పాటు డైట్‌ కూడా కచ్చితంగా ఫాలో అవుతామని ఆయన చెప్పారు. దానికి తోడు సమయానికి నిద్ర పోతానని ఆయన తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సరదాగా పంచుకున్నారు.