Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రతి ఒక్కరిని షాక్ గురి చేసింది. ఇప్పటికే అల్లు అర్జున్ కి మద్దతుగా చాలామంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు నిలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అంతకంతకు సంచలనంగా మారుతూనే ఉంది. ఈ కేసు వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వాదనలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఇలాంటి సందర్భంలో సదరు మృతురాలి భర్త ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. మృతురాలి భర్త భాస్కర్ ఈ విషయంపై స్పందిస్తూ ఒక సంచలన ప్రకటన చేశారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం గురించి స్పందిస్తూ.. తాను కేసును విత్ డ్రా చేసుకుంటానని చెప్పాడు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని, వెంటనే అల్లు అర్జున్ విడుదల చేయాలని భాస్కర్ కోరారు. తన కుమారుడు పుష్ప 2 చిత్రం చూస్తానంటే సంధ్య థియేటర్‌కు తీసుకువెళ్లినట్లు చెప్పాడు. ఇందులో అల్లు అర్జున్ తప్పేం లేదు. ఆయన్ను అరెస్టు చేయనున్నట్లు పోలీసులు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నాడు. ఆస్పత్రిలో ఉన్న.. నా ఫోన్ లో అల్లు అర్జున్ అరెస్ట్ వార్తను చూశాను.
అవసరం అయితే కేసును విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని భాస్కర్ చెప్పారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే షాక్ అవుతున్నారు. కొంతమంది ఇదెక్కడి ట్విస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజెన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో అతనిని బెదిరించి అతని చేత ఇలా ట్వీట్ చేయించారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఆయన మనస్ఫూర్తిగా కేసు విత్ డ్రా చేసుకుంటాను అన్నారా లేదంటే ఎవరి బలవంతం మీద నైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వ్యవహారం పై ఈ వార్తలపై భాస్కర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.