Krish Jagarlamudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతున్న క్రిష్ జాగర్లమూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ తో తనకొచ్చిన విభేదాలు గురించి స్పందించారు. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈయన తప్పుకున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన తర్వాత క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ తో విభేదాలు కారణంగానే క్రిష్ తప్పుకున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు క్రిష్ చేసిన సినిమా విడుదల తర్వాత కూడా ఎక్కడ స్పందించకపోవడంతో వీరి మధ్య విభేదాలు నిజమేనని అందరూ భావించారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలు గురించి క్రిష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక హరిహర వీరమల్లు సినిమా నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను కూడా త్వరలోనే తెలియజేస్తానని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి అభిప్రాయ బేధాలు రాలేదు. తిరిగి పవన్ తో తాను సినిమా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా క్రిష్ వెల్లడించారు. అయితే త్వరలోనే క్రిష్ ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అనే విషయాలపై కూడా క్లారిటీ రానుంది. ఇప్పటివరకు హరిహర వీరమల్లు దర్శక నిర్మాతలు మాత్రం కరోనా, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యం తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నారే తప్ప ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ క్రిష్ తప్పుకోవడం వెనుక మరో బలమైన కారణం ఉందని స్పష్టమవుతుంది. ఆ మరి ఆ కారణం ఏంటో తెలియాల్సి ఉంది.
