నేను మహిళను,పార్శిల్‌ను కాదు ఎవరో వచ్చి ఎత్తుకెళ్ళడానికి… ఫైర్ అయిన ఆలియా?

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ అమ్మడు తన చిరకాల ప్రేమికుడు వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ అమ్మడు అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల క్రితం తను తల్లి కాబోతున్న విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. పెళ్లి జరిగిన రెండు నెలలకె ఇలా ఆలియా శుభవార్త చెప్పటంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా ఆలియా మాత్రం నెటిజన్స్ మీద బాగా ఫైర్ అయ్యింది.

ఆలియా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావటంతో ఆమె నటిస్తున్న సినిమాలన్నీ ఆగిపోయాయని,ఇక ఆమె ఇప్పుడే నటించలేదు అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అంతే కాకుండా ఆలియా ప్రస్తుతం లండన్ లో ఉంది. అందువల్ల రణబీర్ స్వయంగా వెళ్లి తొందర్లోనే ఆలియాని ఇండియాకి తీసుకు రాబోతున్నాడంటూ రకరకాల కథనాల వెలువడ్డాయి.అంతేకాకుండా కొందరు నెటిజన్లు వెటకారంగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు.ఈ వార్తలను చూసి అప్సెట్ అయిన ఆలియా నెటిజన్స్ మీద ఫుల్ ఫైర్ అయ్యింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. “నేను ప్రెగ్నెంట్ అయినా కూడా నాకు విశ్రాంతి అవసరం లేదు.. ఈ విషయంలో నాకు డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందని మీరంతా తెలుసుకుంటే మంచిది. ఇంతటితో నా కెరీర్ అయిపోయినట్టు ఊహించుకోకండీ. నా షూటింగ్.. నా షాట్స్ నాకోసం రెడీగా ఉన్నాయి.. నేను వెళ్ళి షూటింగ్ లో జాయిన్ అవ్వడమే ఆలస్యం. ఇప్పటికైనా మీ ఆలోచనా విధానం మార్చుకోండి అంటూ రాసుకొచ్చింది. మీ రేటింగ్స్ కోసం ఏమైనా రాస్తారా? ఎవరూ ఎవరినీ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మహిళను, పార్శిల్‌ను కాదు ఎవరో వచ్చి జాగ్రత్తగా నన్ను ఎత్తుకెళ్ళడానికి” అంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.