Kranthi Balivaada: సినీ ఇండస్ట్రీ ఈ విషయానికి వస్తే విభిన్న రకాల మనస్తత్వం కలవాలని చూస్తూ ఉంటామని ప్రముఖ నటి క్రాంతి బలివాడ అన్నారు కొంతమంది ఫ్యాషన్ కోసం వస్తే, కొంతమంది ఎంజాయ్ చేద్దామని వస్తారని అలాంటి వాళ్ళని ఎప్పుడు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారని ఆమె అన్నారు. తనకు ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు అలా చాలెంజ్ చేశారని ప్రారంభంలో వాటిని ఫేస్ చేశానని అని ఆమె తెలిపారు మీకు ఏదైనా అవకాశం ఇస్తామని అన్నప్పుడు నేను ఇక్కడికి ఫ్యాషన్ తో వచ్చాను. మీకు క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేదంటే లేదు అని చెప్పినట్టు క్రాంతి బలివాడ స్పష్టం చేశారు.
అలా అన్నప్పుడు నువ్వు ఎలా సర్వైవ్ అవుతావో ఇండస్ట్రీలో మేము కూడా చూస్తాం అన్న వాళ్లు కూడా ఉన్నారని, అలాంటి ఛాలెంజెస్ కూడా తను పేస్ చేశానని ఆమె వివరించారు. తను కూడా క్యాస్టింగ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చానని ఆమె అన్నారు. తనకు అది కూడా సమస్య కాదని ఇండస్ట్రీలో ఉంటే ఉంటాను లేదంటే వెళ్లిపోతా అని, అదీ కాదంటే చదువుకున్నాను కాబట్టి ఏదైనా జాబ్ చేసుకుంటాను అని ఆమె చెప్పారు. దానికి టార్గెట్ పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
అలాంటివాళ్లు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారా అంటే అలాంటి మనస్తత్వం కలవారు ఇంకా ఎందుకు ఉంటారు అని ఆమె సమాధానమిచ్చారు. ఎప్పుడూ ఒక మనిషిని టార్గెట్ చేసి ఏదో చేయాలని ప్రయత్నించకూడదని, తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోవాలని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంచైనా, చెడైనా అదే వస్తుందని ఆమె అన్నారు. నిజంగా రాసిపెట్టి ఉంటే వచ్చేదో తప్పక వస్తుందని, ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సర్వైవ్ కాలేరని, ఒకవేళ అయినా వాళ్లు అక్కడే ఉండి పోతారని ఆమె వివరించారు.