వర్ష, ఇమ్మానియేల్ ని దారుణంగా అవమానపరిచిన హైపర్ ఆది…!

ప్రముఖ బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఆది ఇప్పుడు బుల్లితెర మీద మకటంలేని మహారాజుగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం ఆది జబర్దస్త్ లో కనిపించకపోయినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం బాగా రచ్చ చేస్తున్నాడు. ఈ షోని సక్సెస్ చేయడానికి ఆది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా నేడు ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఆది ఎప్పటిలాగే అందరిమీద తన పంచులతో దాడి చేశాడు.

ఈ క్రమంలో జబర్దస్త్ ద్వారా ప్రేమికులుగా ఫేమస్ అయిన వర్ష, ఇమ్మానియేల్ జంటని దారుణంగా అవమించాడు. మొదట జబర్దస్త్ లో సుధీర్,రష్మి జోడితో మొదలైన ఈ ట్రాకుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. వారిలా జబర్దస్త్ ద్వారా ఎన్నో జంటలు ఫేమస్ అయ్యాయి. అటువంటి జంటలలో వర్ష, ఇమ్మానియేల్ జంట కూడా ఒకటి. అయితే వీరిద్దరూ జబర్దస్త్ లో కేవలం టిఆర్పి కోసం మాత్రమే ఇలా చేస్తున్నారని ప్రేక్షకులకు అర్థమవటంతో ఇద్దరిని బాగా ట్రోల్ చేస్తున్నారు. అందువల్ల వీరిద్దరూ ఈ మధ్యకాలంలో జోడిగా జబర్దస్త్ లో ఎక్కువ కనిపించడం లేదు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం ఇద్దరు బాగా సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో వర్ష, ఇమాన్యుల్ ని అవమానించేలా ఆది మాట్లాడాడు. ఈ క్రమంలో సుధీర్,రష్మి జంటని ఆది ఇమిటేట్ చేస్తూ గతంలో వారు చేసిన పనులను గుర్తు చేశాడు. ఈ మేరకు ఒక సందర్భంలో రష్మి సుధీర్ కి 9 గిఫ్ట్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆది కూడా హీరోయిన్ కోసం ఆది కూడా 11 గిఫ్టులు ఇచ్చాడు.ఆది ఇలా సుధీర్, రష్మి జోడి గురించి మాట్లాడే సమయంలో ఇమ్మానియేల్ వారి జంటకి దిష్టి తగిలింది అందుకే వాళ్ళు విడిపోయారు అని అంటాడు. అప్పుడు ఆది వాళ్లది దిష్టి జోడి.. మీది ముష్టి జోడి అని వర్ష, ఇమ్మానియేల్ పరువు తీస్తాడు.