హైదరాబాద్ లో వచ్చిన వరదల వల్ల ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు. ఒక్కరోజే కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం మొత్తం మునిగిపోయింది. వరదల వల్ల తీవ్రనష్టం వాటిల్లింది. అయితే.. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. వెంటనే బాధితులకు కుటుంబం చొప్పున 10 వేల రూపాయల నష్టపరిహారం అందించింది.
అయినప్పటికీ.. ఇంకా ఎవరికైనా వరద సాయం అందకపోతే.. వాళ్లకు వరద సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీసేవా సెంటర్ల ద్వారా అప్లయి చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో దగ్గర్లోని మీసేవలో అప్లయి చేసుకుంటే… బాధితులు ఇచ్చిన బ్యాంకు అకౌంట్ నెంబర్ కు ప్రభుత్వం పరిహారాన్ని అందిస్తుంది.
వరద బాధితుల కోసమే ప్రభుత్వం 550 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిందని.. మరో 100 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.