దారుణం: మూఢనమ్మకాలతో పెళ్లైన 42 రోజులకే భార్యను అలా చంపిన భర్త!

వివాహమైన ప్రతి ఒక్క అమ్మాయి ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగు పెడుతుంది. అలాంటి ఆశలతోనే ఒక యువతి అత్తవారింట అడుగు పెట్టి పెళ్లయిన 42 రోజులకి మృత్యు ఒడికి చేరిన ఘటన భీమిలిలో చోటుచేసుకుంది. పెళ్లయిన 42 రోజులకే నూతన వధువు ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న ఘటన భీమిలి లోని జీవీఎంసీ 4వ వార్డులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి హరితో తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయమ్మ 42 రోజుల క్రితం వివాహమైంది వివాహమైన తర్వాత నూతన దంపతులు ఇద్దరు అదే వార్డులోని చేపలుప్పాడ సమీపంలోని గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.హరి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా నరసాయమ్మ మాత్రం ఇంటిపట్టునే ఉండేది.ఇలా నరసాయమ్మ వివాహమైన తర్వాత ప్రతి రోజు తన అన్నకు ఫోన్ చేసి తన క్షేమ సమాచారాలు చెబుతూ ఉండేది.

శుక్రవారం ఉదయం నుంచి నరసాయమ్మ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో తన అన్నకు అనుమానం వచ్చి వెళ్లి తన ఇంటిలో చూడగా నరసాయమ్మ విగతజీవిగా పడి ఉంది.ఒక్కసారిగా తన సోదరి అలా చూసేసరికి పోలీస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరిని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఆమె మృతదేహాన్ని గమనించిన పోలీసులు తన శరీరంపై గాయాలు ఉండటంతో తనది హత్య అనే నిర్ధారణకు వచ్చారు.

తన కాళ్లు కట్టేసి ఛాతిపై వాతలు పెట్టడమే కాకుండా తాడుతో ఉరి వేసి చంపారని పోలీసులు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు హరి మూఢనమ్మకాలు అంటే ఎక్కువగా నమ్ముతారని ఈ క్రమంలోని మంత్రాలు తంత్రాలు అంటూ ఎప్పుడు తిరుగుతుండే వాడని వెల్లడించడంతో కేవలం మూఢనమ్మకాల వల్ల తన భార్యకు ఎన్నో చిత్రహింసలు పెట్టి తనని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి అయ్యి భర్తతో ఎంతో సంతోషంగా ఉందని భావించిన తన కూతురు పెళ్లయిన 42 రోజులకే ఇలా కనిపించడంతో నరసాయమ్మ తండ్రి దుర్గయ్య కన్నీరుమున్నీరుగా విలపించాడు.