RRR : వైరల్ : “RRR” కి అక్కడే ఇలా ప్లాన్ చేస్తే మన దగ్గర ఎలా ఉంటుందో.!

RRR : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమాకి తెలుగుతో పాటుగా హిందీ మార్కెట్ లో కూడా భారీ లెవెల్ అంచనాలు ఉన్నాయి. అందుకే రాజమౌళి చాలా జాగ్రత్తలు హిందీ ఆడియెన్స్ కోసం తీసుకుంటున్నాడు. అలా రేపు బాలీవుడ్ గడ్డపై జరగబోతున్న భారీ ప్రీ రిలీస్ ఈవెంట్ వేరే స్థాయిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ ఈవెంట్ ని ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారో ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని బట్టి హిందీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది. అలాగే అక్కడ బాహుబలి నిర్మాత కరణ్ జోహార్ ఈ వేడుకని హోస్ట్ చేస్తాడట ఇంకా చాలానే సర్ప్రైజ్ లు ఇందులో ఉన్నాయని తెలుస్తుంది. మరి హిందీకే ఈ రేంజ్ లో ప్లాన్ చేస్తుంటే ఇక మన టాలీవుడ్ లో ఎలాంటి ప్లానింగ్ లు ఉంటాయో ఊహించలేం.