Janasena: జనసేన ఆవిర్భావ దినోత్సవం… కోట్లు ఖర్చు చేస్తున్న పవన్… ఇదంతా ప్రజా ధనమేనా?

Janasena: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈయన పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తన పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లాలని గట్టి ప్రయత్నాలు చేశారు. ఇదే దిశగా 2014 పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీ బిజెపికి ఈయన మద్దతు తెలిపారు. ఇక 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు నియోజకవర్గాలలో పోటీ చేశారు అయితే ఈ రెండు నియోజకవర్గాలలో కూడా ఈయనకు డిపాజిట్లు కూడా రాలేదు.

ఇకపోతే 2024 ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు అయితే ఊహించని విధంగా ఈయన, తన పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని ప్రాంతాలలో భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 5 శాఖలకు మంత్రిగాను అలాగే డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా మొదటిసారి తమ పార్టీ నుంచి ఈయన డిప్యూటీ సీఎం హోదాలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాబోతున్న నేపథ్యంలో ఘనంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే పిఠాపురంలో ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా జరుగుతున్నాయి. ఊహించని విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారని సమాచారం. పిఠాపురంలో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక పండుగలాగా జరుగుతున్నాయి. మార్చి 14వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది.

చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి రాబోతున్నారని తెలుస్తోంది అలాగే అక్కడ వచ్చిన వారందరికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భోజనాలను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ఇలా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం కోసం భారీ స్థాయిలోనే ఖర్చు అవుతుందని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం కోసం ఖర్చు చేసే ఈ డబ్బు పవన్ కళ్యాణ్ సొంత డబ్బును ఖర్చు చేస్తున్నారా లేక ఇదంతా ప్రజాధనమైనా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఖర్చు చేసే డబ్బు ఎవరిది ఏంటి అనే విషయాలపై జనసేన అధినేత పవన్ స్పందించాల్సిన అవసరం కూడా ఉంది అంటూ పలువురు విమర్శిస్తున్నారు.