చంద్రబాబు అండ్ కో పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్రిగ్గర్ గురి పెట్టిన సంగతి తెలిసిందే. చేసిన తప్పులకు ఇప్పుడు పసుపు నేతలు మూల్యం చేల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈఎస్ స్కామ్ లు..వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్ లని తవ్వి బయటకు తీసారు. ఇప్పటికే పలువురి నేతల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేయించి జైళ్లకు తరలించారు. ఇంకా పలువురి నేతలపై కేసులు రెడీగా ఉన్నాయి. అమరావతి వెనుక జరిగిన స్కామ్ పై సీరియస్ గా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. అక్రమార్కులను, అనుమానితుల్ని తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు , లోకేష్ కాస్త వెనక్కి తగ్గారు.
రాజధాని తరలింపు విషయంలో మొదట్లో వినిపించినంత స్వరం ఇప్పుడు వినిపించడం లేదు. తాజాగా చంద్రబాబు నెత్తిన మరో పిడుగు. మర్చిపోయారుకున్న వివాదం మళ్లీ ముసురుకుంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఢిల్లీ ధర్మ పోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి ఢిల్లీకి పెద్ద ఎత్తున రైళ్లు వేసుకుని జనాల్ని తీసుకెళ్లారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఢిల్లీ రోడ్డ మీదకు తీసుకొచ్చారు. ఆ దీక్ష ఖర్చు 7.5 కోట్లు. భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని అప్పట్లోనే ప్రతిపక్ష పార్టీ సహా బీజేపీ ఆరోపించింది. తాజాగా ఈ వివాదంపై లోకాయుక్త లో ఏవీ రమణ అనే న్యాయవాధి ఫిర్యాదు చేసారు.
దుర్వినియోగం అయిన ప్రజా ధనానికి చంద్రబాబు సరైన బధులివ్వాలని అప్పటివరకూ తన పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. జులై 4న ఫిర్యాదు చేయగా, ఆగస్టు 7న కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అక్టోబర్ 1న చేపట్టనున్నారు. అలాగే ఇతర అవినీతిలపై కూడా లోకాయుక్తలో ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిపై కూడా విచారణ జరగనుంది. దీంతో చంద్రబాబు కు ఇవన్నీ కొత్త టెన్షన్లే. మరి ఢిల్లీ దీక్షలకు బాబు లెక్క ఎలా చెబుతారన్నది చూద్దాం. అలా జగన్ లెక్క కూడా సరి చేసుకుంటున్నారన్న మాట.