వంగవీటి రాధా రీ ఎంట్రీ ఇస్తే – విజయవాడ రాజకీయాలు ఎలా మారతాయి?

రాజకీయాల్లో వారసత్వం ద్వారా నాయకులు అవ్వడం అనేది చాలా సహజం. కానీ ఆ వారసత్వం నుండి వచ్చిన ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని నిలుపుకోవడం అందరికి సాధ్యం కాదు. ఇప్పుడు వంగవీటి రాధను చూస్తేంటే అలాగే అనిపిస్తుంది. వంగవీటి రాధా రంగా విజయవాడ రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్ ను అక్కడ నిలబెట్టి అప్పటి ప్రత్యర్థులకు చుక్కలు చుపించారు. అయితే రంగా చేసిన విధంగా ఆయన కొడుకు రాధను రాజకీయాలు చేయలేకపోతున్నారు. ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోలేకపోతున్నారు.

కొన్ని రోజుల్లో ఆయన రాజకీయ జీవితానికి శుభం కార్డ్ పడ్డా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇప్ప‌టికి మూడు పార్టీలు మారినా.. ఆయ‌న‌లో రాజ‌కీయంగా ఓ నిబ‌ద్ధ‌త క‌నిపించ‌డం లేద‌నేవారే ఎక్కువ‌గా ఉన్నారు.కాంగ్రెస్‌, త‌ర్వాత ప్ర‌జారాజ్యం, త‌ర్వాత వైఎస్సార్ సీపీల‌ను మారి ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ముందు క్ష‌ణికావేశంలో ఆయ‌న వైఎస్సార్ సీపీని వ‌దులుకున్నారు. లేక‌పోయి ఉంటే ఇప్పుడు ఏ ఎంపీగానో లేదా ఎమ్మెల్యేగానో ఉండేవార‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. పోనీ టీడీపీలోకి వెళ్లి ఆయ‌న సాధించింది ఏదైనా ఉందా ? విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు కోసం ర‌గ‌డ చేసి టీడీపీలోకి వెళ్లినా అక్క‌డా ఆ టికెట్‌ను ద‌క్కించుకోలేదు. పైగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెట్ట‌డానికి కూడా త‌న అనుమ‌తి కావాల‌ని ఇక్క‌డి టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా గ‌ట్టిగానే స్ప‌ష్టం చేశారు.

విజయవాడలో కమ్ము నియోజక వర్గం కూడా ఆయనను పట్టించుకోవడం ఆపేసింది. అక్కడి స్థానిక టీడీపీ నేతలైన ఎంపీ కేశినేనితోను, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నతో కూడా సంబంధాలు సరిగ్గా లేవని సమాచారం. ఒకప్పుడు వంగవీటి రాధ నియోజక వర్గంలోకి వస్తే ఆయన చుట్టూ కార్యకర్తలు ఉండేవారు కానీ ఇప్పుడు ఆ క్యాడర్ ను నిలబెట్టుకోలేకపోతున్నారు. రాధ ఇప్పుడు మళ్ళీ ఆక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయన ప్రభావం పెద్దగా ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.