ఇంతకీ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత.?

ఇన్నాళ్లూ పలానా హీరో రెమ్యునరేషన్ 10 కోట్లు.. పలానా హీరో రెమ్యునరేషన్ 25 కోట్లు.. పలానా హీరోకి 50 కోట్లు.. అనే గాసిప్స్ రావడమే తప్ప.. ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో ఎవరికీ తెలీదు. అభిమానులు తీసే లెక్కలూ, మీడియా తీసే గాసిప్పులకీ, అసలు వాస్తవాలకీ ఏ మాత్రం పొంతనే ఉండదు. ఓ ఉదాహరణ చెబుతూ పలానా హీరో రెమ్యునరేషన్ 10 కోట్లు అని తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెబితే, అదే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ అన్నమాట.. అనే భావనలో అదే మాట పట్టుకుని, ఆ మాట చుట్టూ చిన్నపాటి రాజకీయం నడుస్తోంది.

దాంతో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత.? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘వకీల్ సాబ్’ సినిమాకి పవన్ కళ్యాణ్ 40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడనీ, ఆ తర్వాత అది 50 కోట్లకు పెరిగి, ఇప్పుడు 60 కోట్ల మార్కు దాటిందనీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు తలచుకుంటే, అసలు లెక్కలు ఇట్టే తీసేయొచ్చు. కానీ, తీయరు. అయితే, సినిమా రెమ్యునరేషన్ లెక్కలు మాత్రం ఎప్పటికీ ఓ మిస్టరీనే. ఆయా హీరోలు, హీరోయిన్ల పాపులారిటీని బట్టి, రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. సినిమా హిట్ అయితే, ఆటోమెటిగ్గా అది పెరుగుతుంది. ఫట్ అయితే తగ్గిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన అంశమేంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం హిట్టూ, ఫట్టూ అనే సమీకరణాలకు పూర్తిగా అతీతం.