సినిమాలు చేయకున్నా నమ్రత ఇన్ని కోట్ల ఆస్తిని సంపాదించిందా?

నమ్రత ఒకానొక సమయంలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈమె స్వస్థలం ముంబై అయినప్పటికీ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే మహేష్ బాబు సరసన వంశీ సినిమాల్లో నటించిన నమ్రత ఈ సినిమాతోనే మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు. ఈ విధంగా మహేష్ బాబును ప్రేమించిన నమ్రత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఈమె ఎలాంటి సినిమాలోనూ నటించలేదు. ఇకపోతే నమ్రత వివాహం తర్వాత భారీ మొత్తంలోనే మహేష్ బాబుకు కట్న కానుకలు సమర్పించారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇకపోతే నమ్రత వివాహం తర్వాత ఎలాంటి సినిమాలలోనూ నటించకపోయినా మహేష్ బాబుతో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో నటించారు. అలాగే సోషల్ మీడియాలో కూడా నమ్రత ఎంతో ఆక్టివ్ గా ఉంటూ నిత్యం తన పిల్లలకు తన భర్త మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పూర్తిగా ఇంటికే పరిమితమైన నమ్రత భారీగానే ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది.

నమ్రత ఎలాంటి సినిమాలు చేయకపోయినా సుమారు 100కోట్లకు పైగా ఆస్తికి వారసురాలని సమాచారం. ఇది కేవలం నమ్రత ఆస్తులు మాత్రమేనని తెలుస్తోంది. ఈమె సినిమాలలో నటించకపోయినా యాడ్స్ లో నటించడం అలాగే పలు మ్యాగజైన్ కవర్ పేజ్ పై తన భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. ఇక ఎక్కువ సమయం తన కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ నమ్రత తన కెరీర్లో బిజీగా ఉన్నారు.