చాలామంది అమ్మాయిలకు యుక్తవయసు రాగానే బాధించే సమస్యలో మొటిమలు ఒకటి. వీటి వల్ల చాలా సమస్యలు వస్తాయి యువతులకు. ముఖం మీద మొటిమలు రావడం వల్ల ముఖం అందవికారంగా అవడంతో పాటు.. చర్మం పొడిబారిపోవడం లాంటి జరుగుతుంటాయి. మరోవైపు మొటిమల వల్ల వచ్చే నొప్పి కూడా యువతులకు నిద్ర లేకుండా చేస్తుంది.
మొటిమలతో బాధపడే యువతులు… వంటింట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈజీగా మొటిమల సమస్యను తగ్గించుకోవడంతో పాటుగా… నిగనిగలాడే చర్మాన్ని పొందొచ్చు.
నిజానికి మొటిమలు తగ్గడం కోసం చాలామంది కాస్మొటిక్స్ వాడుతుంటారు. క్రీమ్స్ వాడుతుంటారు. అయినప్పటికీ మొటిమలు తగ్గవు. వేలకు వేలు పెట్టిన తగ్గని మొటిమలు.. కేవలం వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో ఈజీగా తగ్గించుకోవచ్చు.
మీకందరికీ గళ్ల ఉప్పు తెలుసు కదా. దాన్నే సీ సాల్ట్ అని అంటారు. సీ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, సోడియం, పొటాషియం లాంటి లవణాల వల్ల చర్మం నిగనిగలాడుతూ మెరవడమే కాదు మొటిమలు కూడా మటుమాయం అవుతాయి.
దానికోసం మీరు చేయాల్సిందల్లా… ఒక గిన్నెను తీసుకొని.. దాంట్లో ఒక చెంచా తేనె, ఒక చెంచా గళ్ల ఉప్పు, సగం నిమ్మ చెక్క రసం వేసి బాగా కలిపి దాన్ని ఒక మిశ్రమంగా తయారు చేయండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి మొత్తం రుద్దండి. నెమ్మదిగా ముఖమంతా ఆ మిశ్రమాన్ని రుద్ది కాసేపు ఆగిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అంతే.. ఇలా రెండు మూడు సార్లు చేస్తే చాలు… ముఖం మీద ఉన్న మొటిమలు మటుమాయం అవడమే కాదు.. జిడ్డు చర్మం పోతుంది.. చర్మం పొడిబారదు.. చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోతుంది.. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీరు కూడా ఓసారి ట్రై చేసి మొటిమల సమస్యను తగ్గించుకొని.. చర్మాన్ని నిగనిగలాడేలా చేసుకోండి.