వైరల్ : “సలార్” క్లైమాక్స్ పై మాసివ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్నటువంటి చిత్రాల్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమాపై కూడా భారీ స్థాయి అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో అయితే కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ ఏక్షన్ సినిమా “సలార్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రాన్ని కూడా ఆ కేజీఎఫ్ సినిమాలు చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వాళ్ళే చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నిర్మాణ సంస్థ నుంచే లేటెస్ట్ గా వచ్చిన మరో సినిమా “కాంతారా”. కన్నడ నాట భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం ఈరోజు తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమా నా ఆల్ టైం ఫేవరేట్ సినిమా అని ప్రశాంత్ నీల్ చెప్పగా దీనికి రిప్లై ఇస్తూ హోంబలే వారు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కాంతారా క్లైమాక్స్ చూస్తూ ప్రశాంత్ నీల్ ఎన్నత ఎంజాయ్ చేసాడో చూశామని. అంటే కాంతారా లో అంతటి సాలిడ్ క్లైమాక్స్ ఉందని వారు రివీల్ చేశారు.

ఇక తాము నీల్ తో చేస్తున్న “సలార్” క్లైమాక్స్ తో అయితే ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తూ మాసివ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఈ అప్డేట్ ఒక్కసారిగా మంచివైరల్ అయ్యింది.