“RRR” పై హాలీవుడ్ “కెప్టెన్ అమెరికా” సినిమా రచయిత సాలీడ్ రెస్పాన్స్.!

దర్శకుడు రాజమౌళి మాత్రం మన తెలుగు సినిమాకి దక్కిన ఒక అరుదైన దర్శకుడు అని చెప్పాలి. తాను చేసిన లాస్ట్ బాహుబలి సిరీస్ ఏమో గాని ఇప్పుడు చేసిన త్రిబుక్ ఆర్(RRR) సెన్సెషన్ అయితే మాములుగా లేదు. రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని స్థాయి రెస్పాన్స్ ని అందుకొని సంచలనం రేపుతోంది. ముఖ్యంగా అయితే హాలీవుడ్ ప్రముఖులు నుంచి నాన్ స్టాప్ రెస్పాన్స్ ఇప్పుడు కనిపిస్తుంది.

ఈరోజు ఉదయాన్నే మినియన్స్ సినిమా రైటర్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించగా ఇప్పుడు హాలీవుడ్ భారీ హిట్ సినిమా కెప్టెన్ అమెరికా రచయిత జాక్ లాన్ జింగ్ సాలిడ్ రెస్పాన్స్ ని అందించాడు. ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ద్వారా ఎవరైనా నువ్ ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో RRR బెస్ట్ సినిమానా? అంటే ఖచ్చితంగా అవును అంటానని రామ్ చరణ్ జిఫ్ ఒకటి పెట్టి తెలిపాడు.

దీనితో కెప్టెన్ అమెరికా సినిమా రచయిత వరకు కూడా ఈ సినిమా వెళ్ళింది అంటే అసలు బయట ఈ సినిమా తాలూకా రీచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ వైడ్ ఈ సినిమా భారీ రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఆలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు నటించగా సముద్రకని, అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.