బిగ్ హింట్ : ‘ప్రాజెక్ట్ కె’ లో ప్రభాస్ పాత్ర తెలిసిపోయిందా..?

ఈరోజు పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ పుట్టినరోజు కావడంతో సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో అలాగే ఆఫ్ లైన్ లో కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్న హీరో స్థాయి నుంచి ఇండియన్ సినిమాని శాసించే స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో ఇండియా లోనే అత్యంత ఖరీదైన సినిమాగా పేరు తెచ్చుకున్న “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి.

దర్శకుడు నాగ్ అశ్విన్ తో మినిమమ్ 500 కోట్లతో స్టార్ట్ చేసిన సినిమా ఇది.. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారు ప్రభాస్ కి తెలిపిన బర్త్ డే విషెష్ ఆసక్తిగా మారాయి. ఈ భారీ సినిమాలో ప్రభాస్ ఏ పాత్ర పోషిస్తున్నాడు అనేది మొదటి నుంచీ ఆసక్తికర ప్రశ్నగా మారింది.

దానికి సమాధానంగా ఇందులో ప్రభాస్ ఒక ‘సూపర్ హీరో’ పాత్రలో కనిపిస్తాడని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ కూడా ప్రభాస్ ని సూపర్ హీరో అనే ట్యాగ్ తోనే స్టార్ట్ చేసి విష్ చెయ్యడం జరిగింది. సో ఈ సినిమాలో ప్రభాస్ చేసేది ఆ పాత్రే అని హింట్ వచ్చినట్టే అనుకోవచ్చు.