Himaja Divorces Gossips : బిగ్ బాస్ రియాల్టీ షోతో తన పాపులారిటీని మరింత పెంచుకున్న నటి హిమజ ఈ మధ్యనే ఓ ఇల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఆ విషయమై ఓ వీడియో కూడా చేసి విడుదల చేసింది. సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు రకరకాల విశేషాల్ని చెబుతూ, తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది హిమజ.
ఏమయ్యిందోగానీ, హిమజ విడాకులు తీసుకుంటోందన్న పుకారు బయటకు వచ్చింది. దాంతో, ఆమెకు పెళ్ళి ఎప్పుడయ్యిందా.? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. హిమజకు రెండుసార్లు పెళ్ళయ్యిందంటూ కొన్ని కథనాలు వచ్చాయి. హిమజ రెండో భర్త ఆమెకు విడాకులిచ్చేశాడన్నది తాజాగా వినిపించిన గాసిప్.
అయితే, ఈ ప్రచారంపై స్పందించిన హిమజ, సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. పెళ్ళి తనకు సరిపడదంటూ తనదైన స్టయిల్లో స్పందించింది. అయినాగానీ, పెళ్ళి చేసుకుంటాననీ, అయితే అది నాలుగేళ్ళ తర్వాత అనీ హిమజ పేర్కొంది. ఈలోగా మంచి వరుడెవరైనా వుంటే చేసి పెట్టాలని కూడా సెటైర్లు వేసింది.
పెళ్ళి చేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానంటూ వివరించిన హిమజ, ఇటీవల తాను సొంత ఇల్లు కొనుక్కున్నాననీ, దాంతో కొందరు తన మీద అక్కసుతో విడాకులంటూ రూమర్లు ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించింది. అంతే కాదు, పోలీసులకు ఈ విషయమై హిమజ ఫిర్యాదు కూడా చేసిందట.
ఈ విషయంలో తనకు న్యాయం జరుగుతుందని హిమజ ధీమాగా వుంది. అయితే, హిమజ మీద అంత అక్కసు ఎవరికి వుందబ్బా.? ఈ మధ్య పెళ్ళి, విడాకులంటూ అర్థం పర్థం లేని గాసిప్స్ ఎక్కువైపోయాయ్ చాలామంది సెలబ్రిటీల విషయంలో. తాజా బాధితురాలు హిమజ అన్నమాట.