బిగ్ బాస్ షోలోకి వచ్చే వారికి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంటుంది. షోలోంచి వెళ్లే ముందు మరో ఇమేజ్ వస్తుంది. కానీ కచ్చితంగా ఇమేజ్‌లో మార్పు వస్తుంది. అది మంచి ఇమేజా? బ్యాడ్ ఇమేజా? అన్నది మాత్రం చెప్పలేం. అయితే మూడో సీజన్ కంటెస్టెంట్లలో దాదాపు అందరికీ మంచి ఇమేజే వచ్చింది. శివజ్యోతి, రోహిణి, హిమజ, అషూ ఇలా అందరూ బాగా ఫేమస్ అయ్యారు. హేమ మొదటి వారంలోనే తట్టాబుట్టా సర్దేసింది. ఆమె అతిని ప్రేక్షకులు భరించలేకపోయారు.
అయితే వారి ఇమేజ్‌లు ఎలాగున్నా బయటకు వచ్చాక మాత్రం ఫుల్ బిజీగా అయ్యారు. ఒక్కొక్కరికి ఆఫర్లు బాగా వచ్చాయి. కొందరికి సినిమా ఆఫర్లు వస్తే.. ఇంకొందరు యాడ్స్‌లో బిజీ అయ్యారు. మరికొందరు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేయడంలో బిజీగా అయ్యారు. ఇలా అందరూ ఒక్కో పనిలో బిజీగా అయ్యారు. ఇలా బిగ్ బాస్ షో అనేది వారి జీవితంలో మంచికే ఉపయోగపడింది. అయితే మూడో సీజన్ బ్యూటీలందర్నీ ఒకే చోటకు తీసుకొచ్చి భలే వాడేస్తున్నారు.
తాజాగా మూడో బిగ్ బాస్ బ్యూటీలు ఒకే వేదికపైకి వచ్చారు. ఆ మధ్య హిమజ పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించింది. అది ఓ యాడ్ కోసం. ఆ యాడ్‌లో బిగ్ బాస్ బ్యూటీలందరూ కనిపించనున్నారు. అషూ, శివజ్యోతి, రోహిణి, హిమజ, హేమ ఇలా అందరూ కూడా ఆ యాడ్‌లో ఉన్నారు. తాజాగా హిమజ షేర్ చేసిన ఫోటోలో అందరూ పట్టుచీరలను కట్టుకుని చందన బ్రదర్స్ యాడ్ కోసం పోజులిచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇలా అందర్నీ ఒకే సారి ఒకే యాడ్‌లోకి పట్టుకొచ్చి వారి క్రేజ్‌ను వాడేశారు.