హిజాబ్‌ తప్పనిసరి కాదు.. విద్యార్థులు ప్రొటోకాల్‌ పాటించాల్సిందే!

కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంది. విద్యార్థులు ప్రొటోకాల్‌ పాటించాల్సిందేనని వెల్లడించింది. హిజాబ్‌ వ్యవహారంసై దాఖలైన పిటిషన్లన్నీ కొట్టేసింది ధర్మాసనం. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదంద తెలిపింది. స్కూల్ యూనిఫాం ప్రిస్క్రిప్షన్ అనేది సహేతుకమైనది అని దానికి విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరని వ్యాఖ్యానించింది. హిజాబ్‌ తీర్పు నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.