ఈసారి దీపావళి సంబురాలు క్రాకర్స్ లేకుండానే జరగనున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో దీపావళికి బాణాసంచా పేల్చకూడదని నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు పేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా… తెలంగాణ హైకోర్టు కూడా టపాసులపై ఆదేశాలు జారీ చేసింది. దీపావళి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టపాసుల అమ్మకాలు, వాటిని కాల్చడం లాంటి చేయొద్దని.. వాటిపై నిషేధం విధించింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు తెలిపింది. టపాసుల అమ్మకాలు, వినియోగాన్ని నిషేధించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.