Tapsee: టాలీవుడ్ బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తాప్సీ పన్ను ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ, ఏడాదికి ఆరు ఏడు సినిమాలలో నటిస్తోంది. అంతేకాకుండా ఆమె నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా కాన్సెప్ట్ ఉన్న కథలనే ఎంచుకుని ఈ బ్యూటీ.
ఇక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. మొదట దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మందినాదం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇక టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే, తమిళంలో కూడా మంచి మంచి ఆఫర్లను అందుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ అలా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.. ఈ క్రమంలోనే మీరు ఎప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా.. అవును నేను చాలామంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను.. అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది తాప్సీ. అనంతరం తన బాయ్ ఫ్రెండ్ మాత్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. నేను నా బాయ్ ఫ్రెండ్ ని మా నాన్న కు పరిచయం చేసినప్పుడు.. అన్నింట్లో తప్పులు వెతికిన మా నాన్న.. అతడి ఎంపిక విషయంలో ఎలాంటి తప్పు కనిపెట్టలేదు అని చెప్పుకొచ్చింది. గతంలో తన తొలి సినిమా దర్శకుడి పై తీవ్ర విమర్శలు చేసిన తాప్సి.. తాజాగా తన స్నేహితుల పై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాప్సీ హీరోయిన్ గా వెండితెర పైనే కాకుండా డిజిటల్ రంగంలో కూడా తన సత్తా చాటుతోంది. ప్రొడ్యూసర్ గాను మారి సినిమాలను నిర్మించడానికి సిద్ధమయ్యింది.